ఏపీ: ఆ టీడీపీ మహిళా ఎమ్మెల్యే పై క్షుద్రపూజలు..!
నిన్నటి రోజున (శుక్రవారం) సాయంత్రం ఈ ఘటన జరగడంతో రాజకీయాలలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి రోజున కారులో వచ్చిన కొంతమంది గుర్తుతెలియని దుండగులు, అనంతపురంలో ఎమ్మెల్యే శ్రావణి నివాసం ఉంటున్న ఇంటి ముందుకు వెళ్లి అక్కడ క్షుద్ర పూజలు తరహాలో పసుపు అద్దిన కొన్ని నిమ్మకాయలను తెల్ల నువ్వులను, పూలను, పసుపు బియ్యాన్ని శ్రావణి ఇంటి ముందు వేసి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్లిన ఎమ్మెల్యే అనుచరుల సైతం ఈ విషయాన్ని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.
దుండగుల కారును పట్టుకోవడానికి వెంబడించిన అప్పటికే వారు వేగంగా వెళ్లి తప్పించుకున్నారనే విధంగా ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఈ విషయం పైన ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తోంది. గత కొద్దిరోజులుగా తనపైన ఇలాంటి మానసిక వేధింపులు చాలానే జరుగుతున్నాయని తనను భయభ్రాంతులకు గురిచేయాలని ఎవరో కొంతమంది తెలిసిన వ్యక్తులు ఇలాంటి పనులు చేయిస్తున్నారంటు తెలిపింది. ఈ వ్యవహారం పైన ఇప్పటికే అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభిస్తున్నారని తెలియజేసింది. దుండగులు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. మరి ఇలాంటివి రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారా? లేకపోతే మరెవనైనా ఇతర కారణాల వాళ్ల చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.