ఏపీ : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే బాబుకు ఎందుకు అంత భయం ..కారణం అదేనా?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో రేపే ఎన్నికలు జరగనున్నాయి.. ఈ సారి ఎవరిని ఎన్నుకోవాలో ఎవరు వస్తే తమ బ్రతుకులు మారిపోతాయో. ప్రజలకు ఈ పాటికే  క్లారిటీ వచ్చేసి ఉంటుంది. బూటకపు వాగ్దానాలతో మోసం చేసే వారికీ ప్రజలు ఈ సారి తమ ఓటుతో బాగా బుద్ది చెబుతారు. ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ప్రజల మద్దతు పొందింది. గత పాలకులు ఎవరు కూడా తమ హయాంలో చేయలేనంత సంక్షేమం, అభివృద్ధి జగన్ కేవలం 5 సంవత్సరాలలో చేసి చూపించారు. కరోనా కష్ట కాలంలో ఇప్పుడు జగన్ ను విమర్శిస్తున్న ప్రతి పక్ష నాయకులు పక్క రాష్ట్రంలో తల దాచుకుంటే జగన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ ఒక్క ప్రాణం పోకుండా వాలంటీర్లు ద్వారా ప్రజలకు వైద్య సదుపాయాలు అందించారు. వాలంటీర్ల ద్వారా ప్రతి పధకాన్ని నేరుగా లబ్ధిదారునికే అందించడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని  వంద శాతం అమలు చేసారు. జగన్ హయాంలో మాకు ఈ పధకం అందలేదు అనేవారు లేరు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా పధకాలు ఆగకుండా చేసారు.

 యువతకు ఉద్యోగ కల్పన చేసారు.. ప్రతి గ్రామానికి రైతు భరోసా, ఫ్యామిలీ డాక్టర్ వంటి సదుపాయాలతో గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగ కరమైన మేలు చేసారు.ఇంత చేసిన జగన్ పై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తుంది. జగన్ తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు ప్రజలకు అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాను అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే   అర్ధం తెలియని వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తారు అని జగన్ ఓ సభలో తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూముల పరంగా ఏదైనా సమస్య ఉంటే జీవితాంతం కోర్టుల చుట్టు తిరగాలి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఆ భూమిపై వున్న వివాదాలను తొలిగించి కోర్ట్ల చుట్టూ తిరిగే భారాన్ని తొలగించేలా చేయడం అని తెలిపారు. ఈ యాక్ట్ కు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకమో కూడా జగన్ తెలిపారు. బాబు తాను దోచుకున్న భూముల లొసుగులు ఎక్కడ బయటపడతాయనో అని ప్రజలకు అబద్దపు మాటలు చెబుతున్నారని ఎవరు నమ్మొద్దు అని జగన్ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: