వరల్డ్ కప్ కి ముందు.. కోచ్ ద్రవిడ్ చేయాల్సిన పని అదే : హర్ష భోగ్లె

praveen
2024 ఏడాదిలో జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత చెత్త ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని అటు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది జట్టు యాజమాన్యం. అయితే ఈ నిర్ణయంతో మళ్ళీ పూర్వ వైభవాన్ని  పొందాలి అని అనుకుంది. కానీ కొత్త కెప్టెన్ వచ్చిన ఆ జట్టుకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. దారుణమైన పరాజయాలతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది ముంబై ఇండియన్స్.

 ఇప్పటివరకు ఏకంగా 12 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు.. కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి అటు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక ప్లే ఆఫ్ లో అడుగు పెట్టకుండా ఇప్పటికే అఫీషియల్ గా అటు ఐపీఎల్ టోర్ని నుంచి లీగ్ దశతోనే నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. అయితే మరీ ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్య మధ్య వివాదం నెలకొంది అంటూ వస్తున్న వార్తలు అభిమానులు అందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.

 ఎందుకంటే ఐపీఎల్ గురించి పక్కన పెడితే రోహిత్, హార్దిక్ ఇద్దరు కూడా వరల్డ్ కప్ కోసం కలిసి ఆడాలి. దీంతో ఏం జరగబోతుందో అనే విషయంపై ఆందోళన నెలకొంది. అయితే ఇదే విషయంపై కామెంట్ స్పందించాడు హర్ష భోగ్లె. 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఓడిన తీరు స్టోరీ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలుస్తుంది అంటూ హర్ష భోగ్లే కామెంట్ చేశాడు. చాలామంది ముంబై ప్లే ఆఫ్ కి వెళ్తుందని అనుకున్నారు. అలా జరగలేదు దీనిని మనం టీమిండియా కోణంలో చూస్తే కోచ్ ద్రవిడ్ చేయాల్సిన పని ఒకటి ఉంది. జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న రోహిత్, హార్దిక్ మధ్య సఖ్యత తీసుకురావాలి. అంతకంటే ముందుగా వారిద్దరు ఫామ్ లోకి వచ్చేలా కృషి చేయాలి అంటూ హర్ష భోగ్లె సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: