రవితేజ... అనుదీప్ కె.వి కాంబో మూవీకి క్రేజీ టైటిల్..?

MADDIBOINA AJAY KUMAR
మాస్ మహారాజా రవితేజ మరికొన్ని రోజుల్లో అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనుదీప్ , రవితేజకు కథను వినిపించడం ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే రవితేజ ఈయన దర్శకత్వంలో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దానితో ప్రస్తుతం అనుదీప్ , రవితేజ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనుదీప్ , రవితేజ మూవీ కి ఓ క్రేజీ టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లు దాదాపు ఇదే టైటిల్ కన్ఫామ్ చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే రవితేజ మూవీ కోసం అనుదీప్ "దొంగ పోలీస్" అనే టైటిల్ అనుకుంటున్నాట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ పేరే పెట్టడానికి ప్రధాన కారణం ఈ మూవీ లో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు , అందులో ఒక పాత్రలో దొంగగాను , మరొక పాత్రలో పోలీసుగాను కనిపించబోతున్నట్లు ఇలా రెండు వేరియేషన్ లలో రవితేజ కామెడీని పండించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో రవితేజ హీరో గా రూపొందిన విక్రమార్కుడు , కిక్ సినిమాల్లో ఈయన దొంగగానూ , పోలీస్ గానూ నటించి రెండు పాత్రల్లో కూడా తనదైన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా రవితేజ దొంగ పోలీస్ పాత్రలో నటించిన సినిమాలు మంచి విజాయలను సాధించి ఉండడంతో అనుదీప్ కేవి మూవీ పై కూడా అంచనాలు పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడుగా జరుగుతుంది. ఈ మూవీ లో కొత్త హీరోయిన్ భాగ్య శ్రీ , రవితేజ కు జోడిగా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: