వైఎస్ విజయమ్మ: కూతురికి సపోర్ట్.. షాక్ లో జగన్..!
కడప లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పోటీపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే ..ఈ ఎన్నికలలో షర్మిలను గెలిపించాలంటూ కూడా ఇప్పటికే వివేకానంద రెడ్డి కుటుంబంతో పాటు పలువురు నేతలు కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు వారి బాటలోనే షర్మిల తల్లి విజయమ్మ కూడా తన కుమార్తెను గెలిపించాలంటూ కోరుతూ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది.
ఈ వీడియోలో వైయస్సార్ ను అభిమానించే వారందరికీ ప్రేమించే వారందరికీ తన హృదయపూర్వకంగా నమస్కారాలు అంటూ తెలియజేస్తోంది విజయమ్మ.. కడప ప్రజలకు నా విన్నపం అంటూ ఈ వీడియోలో మాట్లాడుతూ అనంతరం వైయస్సార్ బిడ్డగా షర్మిల ఎంపీగా పోటీ చేస్తోందని ఆమెని గెలిపించి పార్లమెంటుకు పంపాలి అంటూ తెలియజేసింది. కడప ఓటర్లకు ఈ విషయాన్ని విజయమ్మ చెబుతున్నానంటూ వెల్లడించింది.. దీని ద్వారా తన మద్దతు తన కూతురికే అన్నట్లుగా విజయమ్మ తేల్చి చెప్పేసింది.. ఇప్పటికే జగన్ షర్మిల లో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వలేకని ఆమె విదేశాలకు వెళ్ళిపోయినట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో సడన్గా విజయమ్మ ఇలాంటి వీడియోతో క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.మరి ఈ విషయం తెలిసి జగన్ షాక్ అవుతారేమో చూడాలి మరి