లగ్జరీ కారుకొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ఎన్ని లక్షల్లో తెలుసా..??

murali krishna
బుల్లితెర జంట అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ, గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు సిరియల్స్ లో నటించిన వీరిద్దరూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీరియల్ నటుడిగా అయన కొంతమందికి మాత్రమే పరిచయం అయ్యారు కానీ, బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.ఇక సీజన్ 7లో అమర్ పై జరిగిన ట్రోలింగ్, కాంట్రావర్సీల గురించి ఎంత చెప్పునా తక్కువ. ఇక సీజన్ ముగిసాక తన పని తాను చేసుకుంటున్న అమర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.ఇక రీల్ లైఫ్ లో బిజీగా గడుపుతున్న ఈ జంట రియల్ లైఫ్ కపుల్స్ గా బిజీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇకపోతే అమర్ కూడా బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ పాల్గొని రన్ రప్ గా నిలచిన సంగతి తెలిసిందే. అలాగే తేజస్వి కూడా ఒక పక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మరోపక్క కన్నడ పరిశ్రమల్లో పలు షోలలో అలరిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బుల్లితెర జంట ఓ కొత్త కారును కొనుగోలు చేశారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా అమర్ దీప్, తేజస్విని ఓ కొత్త కారును కొన్నారు. కాగా, తేజస్విని ఆ కొత్త కారు ముందు నిల్చుని పోజుల ఇస్తూ ఫోటోస్ దిగింది. ఇక ఆ ఫోటోలో కొత్త కారు కొన్నామనే సంతోషం ఆమె మొహంలో వెలుగిపోతుంది. అయితే ఆ కారు ఓపెనింగ్ కు అమర్ దీప్,తేజస్విని ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా సందడి చేశారు. కాగా, అందుకు సంబంధించిన ఓ రీల్ కూడా తేజస్విని షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో అరియానా కూడా ఉండటం గమన్హారం. ఇకపోతే అమర్, తేజ్ బ్లాక్ కలర్ టాటా సఫారిని కొన్నట్లు ఆ వీడియో స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీని ధర పదహారు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇక కారుతో చేసిన ఆ రీల్ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ఇకపోతే బిగ్ బాస్ షోలో రన్నర్ గా నిలిచిన ఈ కుర్రా హీరో ఇప్పుడు ఇప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నాడు. కాగా, ఇప్పటికే ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. అయితే అమర్ చేయబోతున్న ఆ సినిమాలో సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రిత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అమర్ దీప్ ఎక్కువగా సినిమాల మీదే ఫోకస్ పెట్టేలా కనిపిస్తోంది. అంతేకాకుండా.. గతంలో రవితేజ సైతం అమర్ దీప్‌కు కచ్చితంగా తన సినిమాలో ఓ పాత్రను ఇస్తానని మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన అభిమాన హీరో రవితేజతో నటించే అవకాశం కోసం అమర్ దీప్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమర్ కొత్త కారు వీడియో పై మీ అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: