పూతలపట్టులో ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ.. వైసీపీ కూటమి అభ్యర్థుల్లో విజేత ఇతనే!
ఈ నియోజకవర్గంలో కూటమి తరపున సీనియర్ జర్నలిస్ట్, డాక్టర్ అయిన కలికిరి మురళీ మోహన్ కు టికెట్ దక్కింది. వైసీపీ కంచుకోట అయిన పూతలపట్టులో పాగా వేయాలని ప్రచారం విషయంలో కలికిరి మురళీ మోహన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని కామెంట్లు వినిపించాయి. ఇద్దరు డాక్టర్లు పూతలపట్టులో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయడంతో నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే చర్చ కూడా జోరుగా జరిగింది.
అయితే చిత్తూరు ఓటర్లు మాత్రం కలికిరి మురళీ మోహన్ కే పట్టడం కట్టడం విశేషం. కలికిరి మురళీ మోహన్ పూతలపట్టు నియోజకవర్గంలో ఏకంగా 14 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. మొదటిసారిగా పూతలపట్టులో టీడీపీ జెండాను ఎగరవేసి మురళీ మోహన్ వార్తల్లో నిలిచారు. తనను గెలిపించిన ఓటర్లకు మురళీ మోహన్ ధన్యవాదాలు తెలియజేశారు.
పూతలపట్టు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తనను గెలిపించిన ఓటర్లకు కలికిరి మురళీ మోహన్ హామీ ఇవ్వడం గమనార్హం. మురళీ మోహన్ గెలుపు కోసం ఎంతో కష్టపడి కాంగ్రెస్, వైసీపీలకు కంచుకోటగా ముద్ర పడిన పూతలపట్టు నియోజకవర్గంలో మాత్రం ఫలితం మార్చేశారనే చెప్పాలి. భారీ మెజార్టీ రూపంలో మురళీ మోహన్ పడిన కష్టానికి ఫలితం అయితే దక్కింది. పూతలపట్టు అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో కలికిరి మురళీ మోహన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.