చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
అవును, ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది. చలికాలంలో నెయ్యి తినటం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో నెయ్యిని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చలికాలంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నెయ్యి చర్మానికి తేమని అందిస్తుంది. దీన్ని తీసుకోవటం వల్ల చర్మం పొడిబారిపోవటం, దురదలు, ర్యాషెస్ వంటి సమస్యలు ఉండవు. చలికాలంలో నెయ్యిని తీసుకోవటం వల్ల బాడీ వెచ్చగా మారుతుంది. దీంతో చలిని తట్టుకోగల శక్తి సమకూరుతుంది. నెయ్యిని తీసుకోవటం వల్ల ఒంట్లో ఉన్న మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. బాడీ క్లీన్ అవుతుంది. తద్వారా కాలేయం ఆరోగ్యం గా ఉంటుంది. నెయ్యి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా చలికాలంలో నెయ్యిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయినా విటమిన్ A, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. చపాతీపై నెయ్యిని వేసి తీసుకోవచ్చు. అయితే ఎంత నెయ్యి వేసుకుంటున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. వంట చేసేటప్పుడు రిఫైండ్ ఆయిల్ కి బదులుగా నెయ్యిని ఉపయోగించడం వల్ల హెల్తీగా ఉండవచ్చు.