వార్ 2 : మేకర్స్ ని తొందరపెడుతున్న తారక్.. కారణం అదేనా..?

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ స్టార్డం తెచ్చుకున్న వారిలో యంగ్ రెబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మ్యాస్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. త్రిబుల్ ఆర్ తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ దేవరతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో
 తార‌క్ బాలీవుడ్ లో వార్2 అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోష‌న్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. తార‌క్ ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు.ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న వార్2 వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలావుండగా తాజాగా ఇటీవల మొదలైన మరో షెడ్యూల్ కూడా పూర్తయింది. ఎన్టీఆర్ పై సోలో ఎపిసోడ్స్‌తో పాటు, హృతిక్ రోషన్‌లపై కొన్ని కీలకమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు.తాజాగా ఈ షెడ్యూల్ పూర్తవ్వడంతో తారక్ ముంబై నుంచి హైదరాబాద్ కు నిన్నరాత్రి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే తారక్ పోర్షన్ ని ఎట్టి పరిస్థుతుల్లో జనవరి కల్లా పూర్తి చేయాలని మేకర్స్ ని కోరుతున్నట్లు సమాచారం. సన్నివేశాల సహా పాటల షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీవ్ అవ్వాలని తారక్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఫిబ్రవరి తొలి వారం నుంచి ప్రశాంత్ నీల్ చిత్రాన్ని పట్టాలెక్కించాలన్నది తారక్ ప్లాన్.
దీనిలో భాగంగా 'వార్-2' మేకర్స్ ని తారక్ తొందర పెడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జనవరి నుంచి ప్రశాంత్ నీల్ పట్టాలెక్కించాలనుకున్నాడు. కానీ తారక్ డేట్లు కుదరకపోవడంతో ఫిబ్రవరికి మారింది. దీంతో తారక్ కూడా వార్ -2 మేకర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొనడం అసాధ్యమైన పని. రెండు కూడా భారీ యాక్షన్ చిత్రాలే. అలాంటి సినిమాల షూటింగ్ లో ఏకకాలంలో పాల్గొనడం ఏనడుకైనా ఇబ్బందే.అందుకే 'దేవర' రిలీజ్ అనంతరం ఎక్కువ సమయం తీసుకోకుండా 'వార్-2' సెట్స్ కి వెళ్లడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి నిర్విరామంగా 'వార్ -2' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వార్-2 ఇదే ఏడాది రిలీజ్ కానుంది. దీనిలో భాగంగా ఆగస్టు నుంచి ప్రచారం పనులు మొదలు పెట్టాలన్నది మేకర్స్ ప్లాన్. తారక్ మళ్లీ ఆగస్టులో వార్ -2 ప్రచారం కోసం కొన్ని రోజులు కేటాయించాల్సి ఉంటుంది.ఈ క్రమంలో హిట్ మూవీ వార్ కు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచ‌నాలున్నాయి. దానికి తోడు ఎన్టీఆర్ ఈ సినిమాలో భాగ‌మ‌వ‌డంతో ఆ అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. హృతిక్, తార‌క్‌ను ఒకేసారి బిగ్ స్క్రీన్ పై చూడాల‌ని మూవీ ల‌వ‌ర్స్ అంద‌రూ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే తార‌క్ నెక్ట్స్ బాలీవుడ్ లో కూడా త‌న స‌త్తా చాటే అవ‌కాశ‌ముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: