పాన్ ఇండియా క్రేజ్‌తో.. అభిమానులకు దూరమవుతున్న హీరోలు ఎవరంటే..?
తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తీసుకోండి .. 2019 నుంచి 2024 మధ్యలో నటించిన్న సినిమా త్రిబుల్ ఆర్ మాత్రమే .. అంటే అరవింద సమేత తర్వాత చేసింది ఒకే ఒక్క సినిమా .. ఇటీవల దేవరతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక మరో స్టార్ హీరో రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది .. 2019లో వినయ్ విధేయ రామాలో నటించిన ఈ హీరో.. తర్వాత నాలుగు సంవత్సరాలలో ఒకే ఒక సినిమా చేశారు .. అదే త్రిబుల్ ఆర్ .. మధ్యలో ఆచార్యలో నటించిన అది గెస్ట్ రోల్ మాత్రమే. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ 2020 లో అలా వైకుంఠపురంలో నటించారు .. ఇక 2021 నుంచి పుష్ప వరల్డ్ లోనే ఉన్నారు .. మరో సంవత్సరం పాటు కూడా అందులోనే ఉండిపోయేలా ఉన్నారు అల్లు అర్జున్ .. తాజాగా పుష్ప2 బ్లాక్ బస్టర్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు . ఇలా చరణ్ , బన్నీ , ఎన్టీఆర్ ముగ్గురు పాన్ ఇండియా సినిమాల కోసమే కెరీర్ను బాగా స్లో చేశారు.
మరో స్టార్ హీరో ప్రభాస్ మాత్రం మంచి దూకుడు మీద ఉన్నారు .. కరోనా తర్వాత రాధే శ్యామ్, ఆదిపురుష్ , సలార్ సినిమాలు వచ్చాయి .. ఈ సంవత్సరం కల్కితో 1000 కోట్లు కొల్లగొట్టాడు .. రాజా సాబ్ కల్కి 2 , సలార్ 2 , స్పిరిట్ హను రాఘవపూడి మూవీ .. హోంబేలె తోమరో మూడు సినిమాలు కమిట్ అయి ఉన్నాయి . ఇలాంటి ప్లానింగ్ లేకే రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ తమ సినిమాలతో వెనుకబడ్డారు .. పాన్ ఇండియా క్రేజ్ మంచిదే అయినా ఇంత స్లోగా అంటే అభిమానులకు దూరమైపోతారు ఈ స్టార్ హీరోలు . రాబోయే రోజుల్లో అయినా ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.