బాలయ్య షో లో వెంకీ మామ.. ఫ్యాన్స్ కి పండగే..!!

murali krishna
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో, ఇప్పుడు నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది.స్టార్ గెస్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ, విశేషమైన రికార్డులను సొంతం చేసుకుంటున్న ఈ షోకి, మరో సీనియర్ హీరో అతిథిగా రానుండటం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది.ఈసారి విక్టరీ వెంకటేష్ అన్‌స్టాపబుల్ స్టేజ్‌ను అలంకరించబోతున్నారు.వెంకటేష్, బాలయ్య మధ్య సంబంధం ప్రత్యేకమైందని తెలిసిన విషయమే. దశాబ్దాలుగా స్నేహంగా ఉంటూ, టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న ఈ ఇద్దరు ప్రముఖులు ఇప్పుడు ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కంటెంట్ అందించడంలో ఆహా ఒక అడుగు ముందుంది. అద్భుతమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు, టాక్ షోలు, గేమ్ షోలు, సింగింగ్ షోలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే బాలయ్య హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో సరికొత్త శకం తెరిచింది.
బాలయ్య తన ఎనర్జీ, చిలిపి ప్రశ్నలతో షోను మరింత పాపులర్ చేశారు.డిసెంబర్ 22,2024న వెంకటేష్ పాల్గొనే ఎపిసోడ్‌ షూటింగ్ జరగనుంది. మామూలుగానే టాక్ షోలకు ఎక్కువగా హాజరుకాని వెంకటేష్, ఈసారి బాలయ్య షోలో కనిపించనుండటం విశేషం. ఇది టాలీవుడ్ అభిమానుల్లో పెరిగిన ఉత్సాహానికి కారణమైంది.ఈ ఎపిసోడ్‌లో ఇద్దరూ స్నేహపూర్వక సంభాషణతో షోను మరింత ఉత్సాహభరితంగా మార్చనున్నారని తెలుస్తోంది. వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు కూడా షోలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. బాలయ్య వేసే చిలిపి ప్రశ్నలకు వెంకటేష్ ఎలా స్పందిస్తారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య ప్రశ్నలతో పెరిగే సరదా, వెంకటేష్ సరదా జవాబులతో షో మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, మరుగున పడిన అనేక ఆసక్తికర విషయాలను వెలికితీసే అవకాశముంది.సరదాగా మాట్లాడే వెంకీమామ - బాలయ్య కలిసి ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: