ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా... ఆరోగ్యం కూడా..!

lakhmi saranya
మేల్ మేకర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీల్ మేకర్ కర్రీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. మరి మీల్ మేకర్ మంచూరియా ఎప్పుడైనా తిన్నారా? మీల్ మేకర్ మంచూరియా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఇష్టంగా తినే ఆహారాల్లో మంచూరియా కూడా ఒకటి. ఇది చాలా సాఫ్ట్ గా, తీయగా, స్పైసీగా చాలా బాగుంటుంది. అందుకే చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టపడి మరి ఈ మంచూరియా తింటారు. ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తో కూడా మనం మంచూరియాలు తయారు చేసుకోవచ్చు. త్వరగా ఈజీగా అయిపోవాలి... ఆరోగ్యంగా ఉండాలి...
 పిల్లలకు నచ్చే స్నాక్ చేయాలి అనుకుంటే మీల్ మేకర్ తో ఇలా మంచూరియా చేసేయండి. ఇది చాలా రుచిగా ఉండటమే ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి మరీ తింటారు. చాలా తక్కువ సమయంలోనే ఈ వంట చేయవచ్చు. మరి ఈ మీల్ మేకర్ మంచూరియా ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా గోరు వెచ్చని నీటిలో మీల్ మేకర్ వేసి ఓ పది నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత పిండి తీసి ఓ గిన్నెలోకి తీసుకోండి. మరోవైపు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ లోపు మీల్ మేకర్ లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా షెజ్వాన్ సాస్, నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని బాగా వేయించుకున్నాక తీసి మరో గిన్నెలోకి తీసుకోవాలి. మరో కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అందులో వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాల పొడి, ఉప్పు, షెజ్వాన్ సాస్, టమాటా సాస్, సోయా సౌండ్స్ వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వెనీగర్ వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత చిన్న బౌల్ లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి కడాయిలో వేసి అన్నీ మరోసారి మిక్స్ చేయాలి. ఇది మరుగుతున్నప్పుడు వేయించుకున్న మీల్ మేకర్ వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ మంచూరియా సిద్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: