కొడుకు ఇంటిపై దాడి.. అభిమానులకు అల్లు అరవింద్ రిక్వెస్ట్!
ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి మహిళ చనిపోయిందని తెలిసినప్పటికి ఆయన సరైన పద్దతిలో స్పందించలేదని నేడు సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు. దాడి అనంతరం అరవింద్ మీడియాతో మాట్లాడారు. నేడు తన ఇంటి దగ్గర జరిగిన ఘటన అందరూ చూశారని అన్నారు. జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారని.. తన ఇంటి దగ్గర మళ్లీ ఎవరు గొడవ చేసినా వాళ్ళను తీసుకెళ్ళేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈసారి అరెస్ట్ తప్పదని తెలిపారు.
ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు ప్రేరేపించకూడదని కోరారు. కాస్తా ఓపికగా ఉండాలని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ఈ అంశంపై సంయమనం పాటించాలని చెప్పుకొచ్చారు. దయచేసి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అల్లు అరవింద్ కోరారు.