తిరుపతి: వెంకన్న సాక్షిగా గెలిచింది టిడిపినే.. ఎంత మెజారిటీ అంటే..?

Divya
వెంకన్న సాక్షిగా ఇక్కడ గెలవబోయేది ఎవరు ? అన్నది అందరిలో ఉత్కంఠత పెంచేసిన విషయం తెలిసిందే అటు టిడిపి ఇటు వైసిపి నువ్వా నేనా అంటూ పోటీకి దిగారు.. నిజానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో వాళ్ళిద్దరూ రాజకీయాల్లో గురు శిష్యులు..  కానీ ఒక్కసారిగా 2024 సార్వత్రిక ఎన్నికలకు దూరం అయ్యారు .. ఇప్పుడు వాళ్ళ తనయులను రాజకీయ వారసులుగా వైసిపి గుర్తించింది.. తండ్రులను పక్కనపెట్టి తనయులను సమన్వయకర్తలను చేసింది.. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తవారిని రాజకీయ వారసులుగా తెరపైకి తీసుకొచ్చింది వైసిపి.. తిరుపతి జిల్లా రాజకీయాల్లో గురు శిష్యులుగా ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి , ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024 ఎన్నికల్లో కొడుకులను గెలిపించుకునేందుకు కష్టపడ్డారు .. ఇద్దరు రాజకీయ వారసులకు వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇది అనివార్యం అయ్యింది..

అయితే ఇక్కడ వైసీపీ తరఫున భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు భూమన అభినయ్ రెడ్డి తిరుపతి రాజకీయాలలో వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉండగా.. కూటమి మాత్రం అనూహ్యంగా ఇక్కడ టిడిపి అభ్యర్థిని మార్చేసి జనసేన వ్యక్తిని రంగంలోకి దించారు. జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు రంగంలోకి దిగారు. ఇకపోతే అభినయ్ విషయానికి వస్తే.. తిరుపతి అభివృద్ధిలో కీలకంగా మారారు.. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం యజ్ఞంలో చేపట్టిన అభినయ్ తిరుపతి నగర అభివృద్ధిలో జనంలో మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.. ఆరు నెలల క్రితమే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూకుడు పెంచిన అభినయ్ తిరుపతి పాలిటిక్స్ లో కీలకమయ్యారు..

ఇక అందుకే ఎలాగైనా సరే ఈసారి అభినయ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పంపాలని వైసీపీ ప్రభుత్వం తీర్మానించింది.. మరొకవైపు జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కూటమి తరపున బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే అభినయ్ దూకుడు యువతకు ఆదర్శంగా ఉంటుందని.. ఓట్లన్నీ ఆయన వైపే వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇద్దరిలో ఎవరు గెలిచారు అని తాజా కౌంటింగ్ ఫలితాల ప్రకారం చూస్తే.. ఆరినేని శ్రీనివాసులు రావు.. భూమన అభినయపైన 61,956 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: