అనకాపల్లి నాన్ లోకల్ ఎంపీ: సీఎం రమేష్.. వాట్ ఎ విక్టరీ!

Purushottham Vinay
చింతకుంట మునుస్వామి రమేష్ (సీఎం రమేష్)  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పెద్ద పారిశ్రామికవేత్త ఇంకా ఎంతో తెలివైన రాజకీయ నాయకుడు కూడా. ఈయన 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.సీ.ఎం.రమేష్ 1985లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా ఇంకా అలాగే ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యునిగా వివిధ హోదాలలో పని చేశాడు. ఆయన 1989 ఎన్నికలలో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా కూడా ప‌ని చేశాడు.సీఎం రమేష్ 2012లో రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నామినేట్ అయ్యాడు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా ఎన్నికయ్యాడు. సీ.ఎం.రమేష్ 2015లో రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) బిల్లుపై రాజ్యసభ ఎంపిక కమిటీ  సభ్యుడిగా, గనులు & ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ), సవరణ బిల్లుపై రాజ్యసభ ఎంపిక కమిటీ సభ్యుడిగా, 2016లో రాజ్యాంగ (నూట ఇరవై మూడవ సవరణ) బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా ఇంకా అలాగే 2017లో మోటారు వాహనాల (సవరణ) బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు.


 ఆయన మార్చి 2018లో రెండోసారి రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. సీ.ఎం.రమేష్ 2019 జూన్ 20న సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ ఇంకా గరికపాటి మోహనరావుతో కలిసి డిల్లీలోని బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.ఆయన ఇప్పుడు ఈ 2024లో లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి అనకాపల్లి లోక్‌సభ స్థానం కి పోటీ చేసి చాలా ఈజీగా గెలిచారు. ఏకంగా 290265 ఓట్ల ఆధిక్యంతో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుపై రమేష్‌ విజయం సాధించారు.నాన్ లోకల్ అది కూడా పక్క జిల్లా కూడా కాదు పది జిల్లాల అవతలి వ్యక్తి అయ్యి ఉండి కూడా గెలిచాడంటే నిజంగా మామూలు విషయం కాదు. సీఎం రమేష్ గొప్ప పారిశ్రామిక వేత్తగానే కాకుండా తన తెలివి తేటలతో మంచి రాజకీయ నేతగా కూడా ఏదిగాడు. ఈయన లెక్కలు కూడా దాదాపు నిజం అయ్యి పోతాయి. వైసీపీకి జనసేన కంటే తక్కువ సీట్లు వస్తాయి అన్నారు. అనుకున్నట్టు గానే వైసీపీకి తక్కువ సీట్లు వచ్చి ఘోరంగా ఓడిపోయింది. అంతటి విజన్ ఉన్న గొప్ప నేత సీఎం రమేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: