తెలుగు సినిమాల్లో చిరంజీవులు.. శభాష్ టాలీవుడ్?

Purushottham Vinay
మన భారతదేశ చరిత్ర ప్రకారం అశ్వత్థాముడు, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపా చార్యుడు, పరశురాముడు ఇంకా వ్యాసుడు...ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అంటారు. యుగాలు గడిచినా కానీ వీళ్లిప్పటికీ భూమిపైనే తిరుగుతున్నారని మన పవిత్ర హిందూ గ్రంధాలు చెబుతున్నాయి. వీళ్లంతా కూడా కారణజన్ములు.పాత తెలుగు సినిమాల్లో మనం చూసాం. కానీ ఈ కాలంలో చూడటం గొప్ప విషయం. హనుమాన్ మూవీలో హనుమంతుడు, విభీషణుడిని చూపించాడు దర్శకుడు ప్రశాంత వర్మ.. ఇప్పుడు కల్కి 2898 AD మూవీలో ధర్మసంస్థాపనలో అశ్వత్థామని చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్. అయితే వాళ్లంతా ఎందుకు సప్త చిరంజీవులుగా ఎందుకు ఉన్నారు....భవిష్యత్ లో వారి పాత్ర ఏంటన్నది సినిమాల ద్వారా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు మన యంగ్ డైరెక్టర్స్. ఈ సప్త చిరంజీవులంతా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో చివరిది అయిన కల్కి అవతారం కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లంతా కూడా ధర్మ సంస్థాపనలో భాగం కానున్నారు. 


శంబలలో కల్కి పుట్టిన తర్వాత సప్త చిరంజీవులంతా వెళ్లి నామకరణం చేయనున్నట్టు భాగవతపురాణంలో ఉంది. శంబల సమీపంలో వ్యాస్ నది ( బియాస్ నది) ఒడ్డున కూర్చుని స్వయంగా వ్యాసమహర్షి...కల్కి జననం గురించి భాగవత పురాణంలో పేర్కొనడం జరిగింది.శంబల నగరంలో కల్కి గా జన్మించిన తర్వాత బాల్యంలో విద్యాభ్యాసం కోసం గురుకులానికి బయలుదేరిన కల్కికి పరశురాముడు సకలవిద్యలు నేర్పించి తన కర్తవ్యాన్ని గుర్తుచేయనున్నాడు. కలిపై దండయాత్రకు బయలుదేరే కల్కి సైన్యానికి యుద్ధ విద్యలు నేర్పించబోయేది అశ్వత్థాముడే... మహాభారత యుద్ధంతో కౌరవుల పక్షాన నిలిచి ఉప పాండవులని చంపి కృష్ణుడి చేతిలో శాపానికి గురైన అశ్వత్థాముడు ఇప్పుడు ధర్మ సంస్థాపనలో భాగం అయి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనున్నాడు. మనకి ఇదంతా కల్కి 2898 ఏడిలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు నాగ్ అశ్విన్. నిజంగా మన హిందూ సంఘటనలని మన చిరంజీవులని ఇలా సినిమా రూపంలో జనాలకి పరిచయం చేస్తున్నందుకు నెటిజన్స్ టాలీవుడ్ కి జై కొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: