లోకల్ థియేటర్ల నుంచి వరల్డ్ స్టేజ్ వరకు.. చిరు హవా!

Amruth kumar
టాలీవుడ్‌లో సంక్రాంతి విన్నర్ ఎవరనే దానికి బాక్సాఫీస్ నంబర్లు పక్కా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన అసలు పేరునే టైటిల్‌గా పెట్టుకుని వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా నైజాం గడ్డపై పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ మెగాస్టార్ మ్యాజిక్ పీక్స్‌లో ఉంది.



తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹222.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భారతదేశంలో ఈ చిత్రం సుమారు ₹157.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. కేవలం వారం రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ వీక్ గ్రాసర్‌గా నిలిచింది. గతంలో ఉన్న 'సైరా నరసింహారెడ్డి' (₹152 కోట్లు) రికార్డును ఈ చిత్రం అధిగమించడం విశేషం.నైజాం ఏరియాలో ఈ సినిమా ఇప్పటివరకు ₹29.5 కోట్ల షేర్ (జీఎస్టీ మినహాయించి) వసూలు చేసింది. సంక్రాంతి సెలవులు ముగిసినా కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.BookMyShow రికార్డు: కేవలం 4 రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడై, ప్రాంతీయ తెలుగు సినిమాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు మొత్తం 2.5 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.



ప్రస్తుతం ఈ చిత్రం ఆరు రోజుల్లోనే ₹261 కోట్ల మార్కును దాటి, ఇప్పుడు ₹300 కోట్ల మైలురాయి వైపు వేగంగా దూసుకుపోతోంది. రెండో వారం కూడా పెద్ద సినిమాల పోటీ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారిందిఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ₹35 కోట్ల పైగా వసూళ్లు సాధించి, అమెరికాలో చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సుమారు ₹200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల జోన్‌లోకి ప్రవేశించింది.



దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు.ఫ్యామిలీ మ్యాన్ గెటప్‌లో చిరంజీవి చేసిన కామెడీ ఫ్యాన్స్‌కు పాత 'ఘరానా మొగుడు', 'శంకర్ దాదా' రోజులను గుర్తు చేస్తోంది. సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీరెన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సాంగ్స్ మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాయి.మొత్తానికి 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద పక్కా 'మెగా' బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ ఏడాది టాలీవుడ్‌కు ఒక అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. సంక్రాంతి సీజన్ ముగిసినా బాస్ హవా మాత్రం తగ్గడం లేదు. 300 కోట్ల క్లబ్‌లో చేరడమే ఇప్పుడు తదుపరి లక్ష్యం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: