ఫ్లాప్ సినిమాలోని సెంటిమెంట్..హిట్ మూవీలోని కామెడీ..ఆదర్శ కుటుంబం కోసం గురూజీ మిక్స్డ్ ప్లాన్..!?

Thota Jaya Madhuri
స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం “ఆదర్శ కుటుంబం” ప్రస్తుతం నిశ్శబ్దంగా కానీ వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది. హీరోగా వెంకటేష్ తనకు సొంతమైన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చూపించబోతుండగా, హీరోయిన్‌గా శ్రీ నిధి శెట్టి నటిస్తోంది. చిత్ర యూనిట్ ఈ సినిమాను చాలా ప్లానింగ్‌తో రూపొందిస్తోంది. ఎలాంటి బ్రేకులు లేకుండా షెడ్యూల్స్‌ను క్రమంగా పూర్తి చేస్తూ షూటింగ్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రమోషన్స్‌ను మాత్రం ముందుగానే ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వేసవి కాలం నుంచే టీజర్, ఫస్ట్ లుక్ వంటి అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా కథా పై కూడా ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది. ఇంటర్వెల్ వరకు సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూడ్‌లో సాగుతుందట. ముఖ్యంగా వెంకటేష్ నటించిన క్లాసిక్ ఫ్యామిలీ కామెడీ సినిమాలైన మళ్ళీశ్వరి మరియు నువ్వునాకు నచ్చావ్ తరహాలో సరదాగా, నవ్వులు పంచే సన్నివేశాలతో మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని చెబుతున్నారు. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ పూర్తిగా టర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది. రెండో భాగంలో కథ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లి, త్రివిక్రమ్ స్టైల్ థ్రిల్లింగ్ నేరేషన్‌తో సాగుతుందట. ముఖ్యంగా ఆథదు తరహాలో గట్టి యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ సన్నివేశాలు ఉండబోతున్నాయని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

ఈ సినిమా కథలో ఎమోషన్, కామెడీ, యాక్షన్ అన్నీ సమపాళ్లలో మేళవించబోతున్నట్లు సమాచారం. గుంటూరు కారం సినిమాలో కనిపించిన సెంటిమెంట్ టచ్‌తో పాటు, అలా వైకుంఠపురం సినిమాలో కనిపించిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్‌ను కలిపి ఒక కొత్త తరహా కథను త్రివిక్రమ్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వెంకటేష్‌కు ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ జతకావడం సినిమాకు మరింత ఆకర్షణగా మారనుంది. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో హాస్యం, భావోద్వేగం రెండూ కలిసి ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని సమాచారం. “ఆదర్శ కుటుంబం” అనే టైటిల్ వినడానికి చాలా సాఫ్ట్‌గా, ఫ్యామిలీ డ్రామా తరహాలో అనిపించినా, సినిమాలో మాత్రం యాక్షన్‌కు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ పరంగా కూడా ఈ సినిమా చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. గత కొన్ని ప్రాజెక్ట్‌లపై వచ్చిన మిశ్రమ స్పందనల తర్వాత ఆయన మరోసారి తన ప్రత్యేకమైన రచన, డైలాగ్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, ఈ సినిమా విజయంపై ఆయన భవిష్యత్ ప్రాజెక్ట్‌ల బజ్ కూడా ఆధారపడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆయన చేయబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ముందు ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయితే ఆ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: