జయం రవి నుంచి.. మెయింటెనెన్స్ కోసం నెలకు అన్ని లక్షలు డిమాండ్ చేస్తున్న ఆర్తి..!

Divya
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పేరు జయం రవి. మొన్నటి వరకు స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించిన ఈ నటుడు ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పలు రకాల వార్తల వినిపిస్తున్నాయి. తమ 15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ జంట 2024 సెప్టెంబర్లో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.



జయం రవి సింగర్ తో ప్రేమాయణం నడుపుతున్నారని అందువల్లే విడిపోయారనే పలు రకాల వార్తలు వినిపించాయి. కానీ జయం రవి మాత్రం తనని వివాహమైనప్పటి నుంచి చిత్రహింసలకు గురి చేస్తున్నారని తన మీద చేతబడి వంటివి చేయించారంటూ, పిల్లల్ని దగ్గరికి కూడా రానివ్వలేదని ఎమోషనల్ గా మాట్లాడారు. అందుకే విడాకులు వచ్చేవరకు తాను సినిమాలలో నటించనని తెలియజేశారు. తన భార్య ఆర్తి, ఆమె కుటుంబం పైన పలు రకాల ఆరోపణలు చేశారు.


ఇక విడాకుల సెటిల్మెంట్ లో భాగంగా ఆర్తి భారీ మొత్తంలోనే భరణం డిమాండ్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. కోర్టులో జీవితాంతం తన మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల తనకు రూ .40 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం, అయితే ఈ విషయం పైన పలువురు నెటిజెన్స్ ఆర్తిని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జయం రవి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారని ఆయన రెమ్యూనరేషన్ తో పోలిస్తే ఈ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆర్తి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నిద్రపోతున్న సింహాన్ని  లేపొద్దు.. కేవలం పిల్లలను నా గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే నేను బయటికి వచ్చి నిజాలు చెప్పాల్సి ఉంటుందని ఒక పోస్ట్ షేర్ చేసింది. మొత్తానికి ఆర్తి అడిగిన డిమాండ్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: