అబ్బా ఇదే అసలైన గుడ్‌న్యూస్.. పార్కింగ్ ఛార్జీలకు హైకోర్టు బ్రేక్!

Amruth kumar
తెలంగాణలోని సినిమా థియేటర్ల వద్ద పార్కింగ్ ఫీజు పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న యాజమాన్యాలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో సినిమా టికెట్ ధర కంటే పార్కింగ్ ఫీజు ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద ఇకపై పార్కింగ్ రచ్చకు ఎండ్ కార్డ్ పడనుంది.



గత కొంతకాలంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు పార్కింగ్ వసూళ్లపై కోర్టులో పోరాటం చేస్తున్నాయి. సినిమా చూసేందుకు వచ్చే వారి నుంచి ఫీజు వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదించాయి. అయితే, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది:తాజాగా జరిగిన విచారణ సందర్భంగా గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 121ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద సినిమా టికెట్ ఉన్న ప్రేక్షకులకు పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సమర్థిస్తూ, ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత థియేటర్లదేనని న్యాయస్థానం పేర్కొంది.



థియేటర్‌కు వెళ్తే టికెట్ ధరతో పాటు స్నాక్స్, పార్కింగ్ అంటూ అయ్యే అదనపు ఖర్చుల వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. తాజా తీర్పుతో పార్కింగ్ ఖర్చు మిగలడం ప్రేక్షకులకు పెద్ద ఊరట.పార్కింగ్ టెన్షన్ లేకపోతే జనం థియేటర్లకు వచ్చే అవకాశం పెరుగుతుందని, ఇది బాక్సాఫీస్ వసూళ్లకు కూడా ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇప్పటికే మల్టీప్లెక్సుల్లో కొన్ని నిమిషాల వరకు ఉచిత పార్కింగ్ సౌకర్యం అమలులో ఉంది. అయితే సింగిల్ స్క్రీన్ల దగ్గర మాత్రం అరాచకం కొనసాగుతోంది. హైకోర్టు తాజా తీర్పుతో ఇకపై యాజమాన్యాలు అక్రమంగా ఫీజు వసూలు చేస్తే లైసెన్సులు రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: