వాయిదా పడ్డ సమంత మా ఇంటి బంగారం.. విడుదల ఎప్పుడంటే..?
ఈ సినిమా పైన ఉండే అంచనాలను దృష్టిలో పెంచుకొని మేకర్స్ విడుదల తేదీ పైన ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది కనుక మే నెలలో ప్లే ఆఫ్ ఫైనాన్స్ జరుగుతాయి. దీంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లలో కంటే ఐపీఎల్ పైన ఎక్కువగా ఉంటుంది దీంతో కలెక్షన్స్ పైన ప్రభావం చూపిస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ కూడా భావిస్తున్నారు. అందుకే ఐపీఎల్ ముగిసిన తర్వాతే వేసవి సెలవులకు చివరిలో ఈ సినిమాను విడుదల చేస్తే కచ్చితంగా ఓపెనింగ్స్ భారీగానే రాబడుతుందని టీమ్ భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందుకే మే 15 కంటే జూన్ 4వ తేదీనే విడుదల చేయాలని చిత్ర బృందం అభిప్రాయపడుతున్నట్లు వినిపిస్తోంది. హీరో యశ్ నటించిన టాక్సిక్ సినిమా కూడా రేస్ నుంచి తప్పుకోవడంతో జూన్ మొదటి వారంలో పెద్దగా సినిమాలకు పోటీ ఉండేలా కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే మా ఇంటి బంగారం సినిమా సోలోగా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమా సరైన సమయంలో విడుదల చేయడం అనేది కచ్చితంగా సినిమాలో సగభాగం విజయానికి కారణం అవుతుంది. మరి సమంత టీమ్ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి ఈ విషయం పైన అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తుందేమో చూడాలి మరి.