టాలీవుడ్
యువ నటుడు శర్వానంద్ తాజాగా నారి నారి నడుమ
మురారి అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో సంయుక్త
మీనన్ ,
సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా ...
రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ప్రేక్షకుల నుండి వచ్చింది. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చిన కూడా ఈ
మూవీ ఈ సంవత్సరం
సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాల కంటే ఆలస్యంగా విడుదల కావడంతో ఈ
మూవీ కి చాలా తక్కువ థియేటర్లు దొరికాయి. అలా తక్కువ థియేటర్లలో ఈ
సినిమా విడుదల అయిన కూడా ఈ సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో ఈ
మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లను సాధిస్తే ఈ
మూవీ హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.
నాలుగు రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.08 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9.93 కోట్ల షేర్ ... 18.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ
సినిమా 10.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ
సినిమా మరో 32 లక్షల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లయితే ఈ
సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.