కన్నప్పకి బిగ్గెస్ట్ మైనస్ లా మారుతున్న విష్ణు?

Purushottham Vinay
సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు తనయుడిగా మంచు విష్ణు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అట్టర్ ప్లాప్ అవుతూ వచ్చాయి. ఇక స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేసిన ఢీ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆయన సక్సెస్ లను ఏమాత్రం కంటిన్యూ చేయలేకపోయాడు.దేనికైనా రెఢీ, దూసుకెళ్తా లాంటి సినిమాలు యావరేజ్ గా ఆడాయి. ఇక ఆ తరువాత ఇప్పటిదాకా మంచు విష్ణు ఒక్క హిట్టు కూడా చూడలేదు.వరుస సినిమాలు చేసిన కూడా ఒక్క హిట్టు రాకపోవడం తో విసిగిపోయిన ఆయన ఇప్పుడు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ‘కన్నప్ప’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇక దీనికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన హీరోగా నిలబడతాడా లేదా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉన్నాయి. 


ఇక ఈ సినిమాలో పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేసుకోవడానికి అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కన్నడ రాజ్ కుమార్, ప్రభాస్ లాంటి స్టార్ నటులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాడు మంచు విష్ణు.ఇక అందులో భాగంగానే మంచు విష్ణు ఈ సినిమాలోని ఒక ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి దాదాపు 5 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసమే అంత డబ్బులు ఎందుకు పెడుతున్నాడు అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆ ఫైట్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ గా మారబోతుందని తెలుస్తుంది.అందువల్ల ఈ మూవీని ఆయన చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంత జాగ్రత్తగా తీసినా కూడా మంచు విష్ణు దొరికిపోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ బాగున్నా కానీ అందులో మంచు విష్ణు గెటప్, హావా భావాలు,చివర్లో శివయ్య అనే అరుపు మైనస్ గా మారాయి. వాటిని చూసి నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా బాణం వేసే సీన్లో విష్ణు కెమెరా వైపు చూస్తూ దొరికిపోయిన క్లిప్ ని తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: