సీమ ఎమ్మెల్యే గారి తాలూకా: సీమ ఫిరంగి.. పెనుగొండ సవితమ్మ..!

Divya
•కష్టకాలంలో ఉన్న కేడర్ కు అండగా సవితమ్మ
•సీమ బిడ్డ ప్రత్యర్థుల గుండెల్లో సీమ ఫిరంగి
•న్యాయం కోసం కోర్టు మెట్లకే ధైర్యం ఈమె సొంతం.

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )
పెనుగొండ ఎమ్మెల్యేగా కూటమిలో భాగంగా టిడిపి తరఫున బరిలోకి దిగి భారీ మెజారిటీతో గెలుపొందిన ఎస్. సవితమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  1977 ఫిబ్రవరి 10వ తేదీన అనంతపురం జిల్లా పెనుగొండలో సోమందేపల్లి రామచంద్రా రెడ్డికి జన్మించిన ఈమె.. 1998లో అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది.. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఈమె.. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించింది. 33,338 ఓట్ల తేడాతో వైసిపి పార్టీకి చెందిన కేవీ ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ పై అఖండ విజయం సాధించింది
 ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం , చేనేత మరియు జౌళి శాఖలకు మంత్రిగా నియమింపబడింది.

సీమ ముద్దుబిడ్డగా ప్రత్యర్ధులను దడదడలాడించడంలో ఈమె తరువాతే ఎవరైనా.. ప్రజల సంక్షేమానికి ఎవరైనా అడ్డుపడితే వారిని తన మాటలతో , చేతలతో ఫిరంగిలా వారి గుండెల్లో దూసుకుపోతూ న్యాయపరమైన పరిపాలనతో రాష్ట్రాన్ని సుభిక్ష పరచాలనే ఆలోచనతోనే అడుగులు వేస్తూ ఉంటుంది.. అధికార పార్టీ ఓడిపోతే వేరొక పార్టీలోకి వెళ్లకుండా నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడి పనిచేసింది.మా పెనుగొండ తెలుగుదేశం అడ్డా అని చెప్పే పెనుగొండ సవితమ్మ.. కష్టకాలంలో ఉన్న కేడర్ ను ఆదుకుంది.. వాహనదారులకు ఇంధన సమస్యలు రాకుండా వైసిపి హయాంలో పార్టీతో గొడవపడి మరి కోర్టుకెళ్లి పర్మిషన్ తీసుకొచ్చి పెనుగొండ లో పెట్రోల్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసిన ఘనత ఈమె సొంతం.

ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే ప్రజలతో మమేకం అయ్యామో .. పదవి పోయిన తర్వాత కూడా వారితో అలాగే కలిసిమెలిసి తిరిగాము. అరాచకాలను అండగట్టి ప్రజలకు అండగా నిలవాలనే ధ్యేయంతో.. టీడీపీ జెండా ఎగరవేశామని.. గతంలో చెప్పి అనుకున్నట్టుగానే ప్రజల సానుభూతి పొంది నేడు పెనుగొండ ఎమ్మెల్యే గా మాత్రమే కాదు మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు సవితమ్మ. గతంలో వైసిపి వారు ఈమెపై ఎన్నో కేసులు పెట్టారు.. అయితే తమలోకి వస్తే కేసులు తీసేస్తామని.. నామినేటెడ్ పదవి ఇస్తామనీ కూడా ఆశపెట్టారు..  కానీ వాటిని లొంగకుండా పార్టీ కోసం ఎన్ని కష్టాలైనా పడతానని.. పార్టీకి అండగా నిలుస్తోంది సవితమ్మ. నమ్ముకున్న పార్టీ కోసం ఎంతటికైనా పోరాడతాను అంటూ చెప్పి నేడు సీమ ముద్దుబిడ్డగా ఫిరంగిగా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: