సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో వస్తున్న అల్లరి నరేష్.. పోస్టర్ వైరల్..?

murali krishna
టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ సినిమాలతో అల్లరి నరేష్ ఎంతగానో పాపులర్ అయ్యారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.. అయితే గత కొంతకాలంగా అల్లరినరేష్ నటిస్తున్న కామెడీ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి. దీనితో అల్లరి నరేష్ రూటు మార్చి మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను నటించిన నాంది, ఉగ్రం సినిమాలు ఆ జోనర్ లో తెరకెక్కినవే. ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.అప్పటి వరకు కామెడీతో ఎంతగానో అలరించిన నరేష్ యాక్టింగ్ స్కోప్ వున్న పాత్రలలో నటించి ఎంతగానో మెప్పించాడు..అల్లరి నరేష్ ఈ ఏడాది నాగార్జున హీరోగా తెరకెక్కిన “ నా సామి రంగ “ సినిమాలో అంజి అనే పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. 

ఇదిలా ఉంటే రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన మూవీ “ ఆ ఒక్కటి అడక్కు “. మల్లి అంకం తెరకెక్కించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం అల్లరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ “బచ్చల మల్లి”.. సుబ్బు మంగాదేవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే నేడు అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా మరో నూతన మూవీ ప్రకటించారు.మెహర్ తేజ దర్శకత్వంలో అల్లరి నరేష్ తన తరువాత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ బ్యానర్ సితార ఎంటరటైన్మెంట్స్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో 63 వ సినిమాగా తెరకెక్కుతుంది.తాజాగా నరేష్ పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. “అతని కంటి నుంచి మీరు తప్పించుకోలేరు” మేకర్స్ ప్రేక్షకులలో ఆసక్తి పెంచారు..సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇతర వివరాలు తెలియజేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: