
కోహ్లీకి.. కీలక బాధ్యతలు అప్పగించిన రాహుల్ ద్రవిడ్?
ఇకపోతే ఇక జట్టు విజయాలలో ఎప్పుడు కీలకపాత్ర వహించే విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు కాస్త పేలవమైన ఫామ్ తో ఇక విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో కూడా విరాట్ కోహ్లీ ఇలాగే చెత్త ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫైనల్ లో రాణించడంతోనే అటు భారత జట్టు వరల్డ్ కప్ టైటిల్ గెలవగలిగింది.
అయితే ఇటీవల అంతర్జాతీయ టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీకి కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఒక కీలక బాధ్యతని అప్పగించాడట. టెస్ట్ ఫార్మాట్లను భారత జట్టును ఛాంపియన్గా నిలపాలని సూచించాడట. తెల్లబంతితో ఆ మూడు సాధించాం. ఇక ఎరుపే ఉంది. అది కూడా సాధించండి అని విరాట్ కోహ్లీకి సూచించాడట రాహుల్ ద్రావిడ్. టి20 వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మూడింటిలో కూడా టీమిండియా విజయం సాధించింది. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో గెలవాలని కల నెరవేరలేదు. 2021 2023లో ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ భారత జట్టు చివరికి ఫైనల్ లో ఓడిపోయి నిరాశ పరిచింది .