కల్కి ఎఫెక్ట్ : బాలీవుడ్ మేకర్స్ కి సరికొత్త సవాల్ విసిరిన అమితాబ్..!?

Anilkumar
బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన కల్కి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కాగా ఈయన పాత్ర కల్కి సినిమాకి హైలెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వయసులో ఆయన ఎటువంటి పాత్రలో నటించిన అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. ఇక ఇందుకుగాను ఆయనకి ఈ పాత్రలో నటించినందుకు భారీ గుర్తింపు దక్కింది. అంతే కాదు కల్కి సినిమాలో ప్రభాస్ తర్వాత అంత క్రేజ్ ఎవరికి వచ్చింది అంటే అమితాబచ్చన్ కి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం అమితాబచ్చన్ కి మాత్రమే కాకుండా ఆయనకి పోటీగా నటించిన

 లోకనాయకుడు కమలహాసన్ పాత్రకి కూడా మంచి గుర్తింపు దక్కింది. కానీ కమలహాసన్ పాత్ర సినిమా చివరిలో ఉంటుంది. అందుకే ఆయన పాత్ర పెద్దగా సినిమాలో కనిపించదు. కానీ అమితాబచ్చన్ మాత్రం ఓవరాల్ మూవీ ఉండడంతో ఆయన పాత్రకి మంచి గుర్తింపు లభించింది. కల్కి అశ్వద్ధామ పాత్ర అమితాబ్ చేసిన మైల్ స్టోన్ సినిమాలతో పాటు నిలుస్తుందని చెప్పొచ్చు. కల్కి తర్వాత బాలీవుడ్ లో కూడా అమితాబ్ కు వరుస క్రేజీ ఆఫర్లు వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ కల్కి వసూళ్ల హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఈ దూకుడు చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమా లోడ్

 అవుతుందని చెప్పొచ్చు. తన ఏజ్ కి తగిన పాత్రల్లో నటిస్తూ వస్తున్న అమితాబ్ కల్కిలో అశ్వద్ధామ పాత్రలో తన మార్క్ చూపించారు. అసలు 80 ప్లస్ అమితాబ్ ప్రభాస్ తో ఫైట్ చేయడం అన్నది ఊహిస్తేనే నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది. అమితాబ్ యాక్టింగ్ తో కల్కికి కొత్త వన్నె తెచ్చారు.అంతేకాదు బాలీవుడ్ మేకర్స్ అందరికీ అమితాబ్ కొత్త ఛాలెంజ్ ఇచ్చినట్టు అయ్యింది. ఆయన్ను కేవలం ఏజ్ కి తగిన పాత్రల్లో కాదు ఇలా ప్రయోగాలు కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: