జనసేన ఎమ్మెల్యే కన్నీళ్లు.. సభలోనే ఏడ్చేశారు..??

Suma Kallamadi
జనసేన పార్టీ నేత బోలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో 62 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ నేత మెగా ఫ్యామిలీతో కలిసి అడుగులు వేయడం కొత్తేం కాదు. కాపు సామాజిక వర్గానికి చెందిన బోలిశెట్టి శ్రీనివాస్‌ కాపు నేతలకు రాజ్యాధికారం దక్కాలని ఎంతో కృషి చేశారు. చిరంజీవి వెనుక ఉండి ఆయనను ముందుకు నడిపించిన అతి కొద్ది మందిలో బోలిశెట్టి కూడా ఒకరు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత కూడా బోలిశెట్టి మెగా ఫ్యామిలీ కే అంటిపెట్టుకొని ఉన్నారు.
జనసేన పార్టీని స్థాపించాక పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.  ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎదిగారు బోలిశెట్టి. ఈ స్థాయికి రావడానికి అతను చాలానే కష్టపడ్డారు. ప్రజలనే నమ్ముకున్నారు. ఏదో ఒక రోజు ప్రజలకు మంచి చేసే పొజిషన్ కి వస్తాననే చిన్న ఆశతో ముందుకు సాగారు. చివరికి అఖండ విజయంతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన విజయం చిన్నది ఏమీ కాదు. ప్రజలు ఈ నేత కష్టాన్ని గుర్తించారు. అందుకే భారీ మెజారిటీతో గెలిపించారు.
ఈ జర్నీని ఆయన తలుచుకుంటూ తాజాగా ఒక సభలో కంటతడి పెట్టుకున్నారు. ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఇటీవల ఒక సభ నిర్వహించారు. ఇందులో ఆయన తన పొలిటికల్ కెరీర్ ను ఫస్ట్ నుంచి గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. ఆయన ఇన్ని రోజులు ఎన్నో బాధలను భరించారు. దాని వల్ల కలిగిన బాధను గుండెల్లోనే దాచుకున్నారు. ప్రజలు తన కష్టాన్ని గుర్తించి ఆదరించడంతో ఆ దుఃఖం అంతా ఒక్కసారిగా బయట పెట్టుకున్నారు. ఇక తనకి ఏ బాధ లేదన్నట్లు, అంతా సంతోషమే అన్నట్లు ఆయన ముఖంలో చిరునవ్వు కూడా కనిపించింది. ప్రజల కోసం పని చేస్తే ఏదో ఒక రోజు తప్పనిసరిగా విజయం వరిస్తుందని ఈ జనసేన నేత విషయంలో ప్రూవ్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: