ఏపీపై వ్య‌తిరేక భావ‌న తొల‌గించేలా రేవంత్ అడుగులు..!

RAMAKRISHNA S.S.
- తెలంగాణ స‌మాజానికి సానుకూల సంకేతాలిచ్చిన రేవంత్‌
- ఏపీ శ‌త్రువు అన్న కేసీఆర్ సిద్ధాంతాన్ని వ‌దిలిపెట్టాడుగా..
- త‌న‌ మార్క్ ప‌రిణితి చూపించాడుగా..!
( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య జ‌రిగిన విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌.. ఆస‌క్తికంగా.. ఆలోచ నాత్మ‌కంగానే సాగింద‌ని చెప్పాలి. ద‌శాబ్దాల కాలం కింద‌టి స‌మస్య‌లు ప‌రిష్క‌రించుకుని ముందుకు సాగా ల‌ని నిర్ణ‌యించుకోవ‌డం.. క‌మిటీలు వేయ‌డం.. వంటి ప‌నుల వ‌ర‌కు అంతా బాగానే సాగింది. అయితే ఎంత లేద‌న్నా.. ముఖ్య‌మంత్రుల‌పై ఒత్తిళ్లు అయితే ఉన్నాయి. ఈ విష‌యంలో రాజీ ప‌డాల్సిన అవ‌స రం లేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా అలానే చేశారు.

గ‌త కేసీఆర్ స‌ర్కారు ఇరు రాష్ట్రాల విభ‌జ‌న‌ స‌మ‌స్య‌ల‌ను రాజ‌కీయ కోణంలో చూసిన ద‌రిమిలా.. ప‌రిష్కా రం జ‌ఠిల‌మైంద‌నే వాద‌న ఉంది. రాష్ట్రాన్ని సాధించ‌డం వ‌ర‌కు కేసీఆర్‌.. తెలంగాణ వాదాన్ని వినిపిం చారు. రాష్ట్రాన్ని ద‌క్కించుకున్నారు. అయితే..త‌ర్వాత కూడా.. ఇంకా ఏపీ అంటే శ‌త్రువుగానే ప్రొజెక్టు చేశారు. ఫ‌లితంగా విభ‌జ‌న హామీల‌ను ప‌రిష్క‌రించే ప‌రిస్థితి లేకుండా చేశార‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం ఇంకా కేసీఆర్ తాలూకు వాస‌న‌లు ప్ర‌జ‌ల్లో నుంచి పోలేదు.

కేసీఆర్ పాల‌న పోయినా.. ఆయ‌న వేసిన బీజాలు ప్ర‌జ‌ల మ‌స్తిష్కాల్లో  నాటుకుపోయాయి. ఇదే ఇప్పుడు సీఎం రేవంత్‌కు కూడా.. ఇబ్బందిగా మారింది. వాస్త‌వానికి విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వాటికి మాత్ర‌మే ప‌రి మితం కావాల్సిన‌.. రాష్ట్రాల వివాదాలు.. హ‌ద్దులు దాటిన నేప‌థ్యంలోనే అప‌రిష్కృతంగా ఉన్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించింది.. కూడా ఈ ధోర‌ణిలోనే. అయితే.. ఇప్పుడు వీటిని ప‌రిష్క‌రించాల‌ని ఉన్నా..రేవంత్‌కు సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోందా? అంటే.. ఒకింత ఇబ్బందిక‌ర‌మేన‌ని చెప్పాలి.

మ‌న‌సులో ఏమున్నా.. బ‌య‌ట‌కు మాత్రం తెలంగాణ వాదాన్ని వినిపించేలా చేయాలి.. క‌నిపించేలా కూడా చేయాలి. లేక‌పోతే.. `ఇన్నాళ్లు మేం కాపాడిన తెలంగాణ అస్తిత్వాన్ని.. దోచి పెడుతున్న‌డు` అంటూ.. బీఆర్ ఎస్ నుంచి తూటాల్లాంటి మాటలు.. శ‌ర‌వేగంగా వ‌చ్చి.. రాజ‌కీయ ప్ర‌భావం చూపించే ఛాన్స్ కూడా ఉంది. అందుకే..తొలి భేటీలో రేవంత్ త‌న దైన శైలిలో వ్య‌వ‌హ‌రించారు. రెండు క‌మిటీలు వేయ‌డం ద్వారా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.. త‌మ చేతుల్లో లేదు.. క‌మిటీల‌కు అప్ప‌గించామ‌న్న సంకేతాలు ఇచ్చి.. త‌ద్వారా తెలంగాణ స‌మాజాన్ని సానుకూల దిశ‌గా ఆయ‌న న‌డిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: