రోడ్డుపై టిఫిన్ సెంటర్ నడుపుతున్న.. బుల్లితెర నటి.. గుర్తుపట్టారా?

praveen
సినిమాల్లోకి వెళ్లి ఫేమస్ అవ్వాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది కోరిక నెరవేర్చుకోలేకపోతు ఉంటారు. కొంతమంది అవకాశాలు రాక.. ఇంకొంతమంది సినిమాల్లోకి ఎలా వెళ్లాలో దారి తెలియక సైలెంట్ గా ఉండిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్లి కొన్ని అవకాశాలు అందుకున్న ఆ తర్వాత అదృష్టం కలిసి రాక చివరికి కనుమరుగవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అలాంటి నటీనటుల గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. ఇక్కడ టిఫిన్ సెంటర్ నడుపుతున్న మహిళా కనిపిస్తుంది కదా ఆమె ఎవరో కాదు ఒక నటి. సీరియల్లో నటించి తన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకున్న నటి ఆమె. ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణం ఆమెది. ఆమె పేరు ఝాన్సీ. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని విషయాలను తెలిపింది.

 ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడే తన ఇంటికి ఇరుపక్కల రామకృష్ణ థియేటర్ వెంకటేశ్వర థియేటర్ లో ఉండేది. ఆ థియేటర్ నుంచి వచ్చే సౌండ్స్ విన్నప్పుడల్లా తను కూడా సినిమాల్లో నటించాలని కోరిక ఆమెకు కలిగేది. ఇక తనను తాను స్క్రీన్ మీద చూసుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. డబ్ స్మాష్, టిక్ టాక్ లాంటి యాప్ ద్వారా యాక్టింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇక వీడియో చూసిన తన కుటుంబ సభ్యులు స్నేహితులు బాగా ఎంకరేజ్ చేశారు. పెళ్లి అయిన తర్వాత మీకు సీరియల్ నటించే అవకాశం వచ్చింది. చాలా సీరియల్స్ లోనే నటించ్చింది. గృహప్రవేశం, నిన్నే పెళ్ళాడుతా, గుప్పెడంత మనసు, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్ లో కూడా నటించింది. విమానం, లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ, రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ లో  కూడా నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు ఇలా టిఫిన్ బండి నడుపుతున్నట్లు నటి ఝాన్సీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: