ఏపీ: కీలక నిర్ణయం దిశగా జగన్... ఆయన లెక్క వేరే..?

FARMANULLA SHAIK
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జగన్ కరెక్షన్స్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు సుమారు 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మార్చిన జగన్ కు ఆ అనుభవం ఓ భారీ చేదు జ్ఞాపకంగా మారిందని అంటున్నారు అలాగే నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు.ప్రస్తుతం తండి వైస్సార్ జయంతి వేడుకలకు రెండు రోజుల ముందే ఆయన కడపకు మకాం మార్చారు.ఈ నెల ఎనిమిదిన దివంగత సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి. ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజులకు ముందే మాజీ సీఎం వైఎస్. జగన్ పులివెందులకు రావడం వెనుక కూడా బలమైన కారణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో శనివారం, ఆదివారం పూర్తిగా కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణతో వచ్చారని తెలిసింది. తన తండ్రి వైఎస్ఆర్ జయంతి లేదా అంతకుముందే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.ఈ ఎన్నికల్లో భారీగా ఓటమి పాలైన జగన్ తనకు ప్రతిపక్షం కూడా దక్కాలేదనే బాధతో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం వైఎస్. జగన్ రాసిన లేఖ వల్ల కూడా ప్రయోజనం లభించే అవకాశం లేదనే విషయం మంత్రుల వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లడం ఎలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఒకపక్క పాత కేసుల్లో రోజువారీ విచారణకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జనంలో లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అసెంబ్లీకి కూడా వెళ్లలేని వాతావరణం ఏర్పడిందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్. జగన్ పార్టీ క్యాడర్, సీమ ప్రాంత నేతలతో భేటీ కావడానికి రెండు రోజుల ముందే పులివెందులకు వచ్చినట్లు భావిస్తున్నారు. అసెంబ్లీ కాకుండా, పార్లమెంట్కు వెళ్లేందుకు సమాలోచనలు సాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అయితే దాని పై జగన్ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: