చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చ..??

Suma Kallamadi
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. రాష్ట్రాలు విడిపోయాక తలెత్తిన సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాలేదు. గతంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చంద్రబాబు - కేసీఆర్, జగన్ - కేసీఆర్ అధికారంలో ఉన్నారు కానీ వారు సమస్యలను పరిష్కరించుకోలేదు ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు వీరిద్దరూ మంచి అనుబంధాలు కలిగిన వారు. తాజాగా వీరు సమస్యలపై చర్చించేందుకు భేటీ అయ్యారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్‌ టాపిక్ గా మారింది.
 రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబుతో కలిసి పనిచేశారు. చంద్రబాబు చెప్పినట్టు చేసి తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తారేమో అని కొందరు షాపింగ్ వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు ఎన్డీయేతో పొత్తు కుదుర్చుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత కాబట్టి ఎన్డీయే అంటే ఆయనకు పడదు. మరి వీళ్ళిద్దరూ భేటీ అయ్యే కేంద్రం నుంచి ఎలాంటి ప్రయోజనాలు తీసుకొస్తారు అనేది ప్రస్తుతం ప్రశ్నలతో ప్రశ్నార్థకంగా  మారింది.
  విభజన హామీల విషయంలో రెండు రాష్ట్రాలు తగ్గడం లేదు. మరి ఈ మీటింగ్ వల్ల ఎవరికి ప్రయోజనం నష్టం తప్ప అని పలువురు మాట్లాడుతున్నారు. టీడీపీ తెలంగాణలో ఉంది కానీ కేసీఆర్ కారణంగా అది మూడం పడ్డది ఇప్పుడు రాజకీయంగా బలోపేతం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరిద్దరి మధ్య సాగే సమావేశాలను తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించవచ్చు.
చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ ద్వారా తెలంగాణకి లాభం జరుగుతుందో లేదో తెలియదు కానీ కేసీఆర్ కు లాభం చేకూర్చున్నట్లు అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుసగుసలాడుతున్నారట. ఇన్సైడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు రేవంత్ రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా సొంత ప్రయోజనాల గురించి చర్చించుకుంటున్నారట. అయితే ఇవే కాకుండా వారు కేంద్రం సహాయంతో రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను తీర్చితే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: