ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ లిరిక్ రైటర్..?

murali krishna
చంద్రబోస్ రాసే పాటలు ఎంత కమ్మగా, అర్థవంతంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచిన చంద్రబోస్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్‌గా మారిపోయారు. ఆయన తన సొంతూరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారం లైబ్రరీని కట్టించాడు. దానికి ఆస్కార్ లైబ్రరీ అని పేరు పెట్టాడు.చిన్నతనంలో తన ఇంటి పక్కన ఉండే లైబ్రరీలోని పుస్తకాలు చదివే ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేసుకున్నాడు. కాగా మొత్తం రెండు అంతస్థులతో సకల సౌకర్యాలతో ఆస్కార్ గ్రంథాయలయాన్ని నిర్మించారు చంద్ర బోస్. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ‘చల్ల గరిగె గ్రామస్థులకు ఇచ్చిన మాట ప్రకారం సరస్వతి గుడిని నిర్మించాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ వచ్చిన తరువాత ఊరంతా కలిసి తనను సన్మానించిన సమయంలో ఈ విధంగా మాట ఇచ్చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చుతో ఇలా లైబ్రరీని కట్టించాడు.ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్ కేవలం సినిమాలకు పాటలు రాసే కవి అనే దానికంటే..సరస్వతి పుత్రుడు అనడం ఉత్తమం. చంద్రబోస్ రాసిన తెలుగు పాటకు తెలుగు ఇండస్ట్రీలోని అవార్డుల మొదలు..ప్రపంచ స్థాయి అవార్డులైన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అకాడమీ అవార్డులు రావడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా చెప్పవచ్చు.తెలుగు సినీ పరిశ్రమకు అన్ని రకాలైన పాటలతో..తనదైన అక్షరాలా సంపుటితో మరుపురాని పాటలు అందించాడు చంద్రబోస్.ఎంత ఎదిగినా తాను పుట్టిన ఊరిపై ఉన్న ప్రేమను ఇలా ఆస్కార్‌ గ్రంథాలయంతో చాటుకున్నాడు. ఈ కార్యక్రమానికి చంద్రబోస్‌ మిత్రులు, సినీ ప్రముఖులు,రాజకీయా నాయకులు హాజరరయ్యారు.ఈ ఆస్కార్‌ గ్రంథాలయంలోని పుస్తకాలూ చదివి ప్రతి ఒక్కరు..ఒక చంద్రబోస్ కావాలని ఊరంతా ఆశిస్తున్నారు.గురువారం (జూలై 4న) భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్‌ చేతుల మీదుగా ఈ ఆస్కార్‌ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆసార్‌ అవార్డుకు తీపిగుర్తుగా రూ.36 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి ఆస్కార్‌ గ్రంథాలయం అని నామకరణం చేశారు. రెండంతస్తులతో నిర్మించిన ఈ గ్రంథాలయ భవన నిర్మాణం దాదాపు అంత పూర్తయి, అన్ని హంగులతో చాలా చక్కగా రూపుదిద్దుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: