మోడీకి దగ్గరయ్యేలా జగన్ మాస్టర్ ప్లాన్.. బాబును టెన్ష‌న్‌ పెట్టినట్టే..!

RAMAKRISHNA S.S.
చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ను ముప్పు తిప్పలు పెట్టేందుకు ఎప్పటికప్పుడు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వస్తున్నారు. అందుకే 2014లో పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీతో స్నేహం చేసిన చంద్రబాబు.. 2019 ఎన్నికలలో వారిద్దరిని పక్కన పెట్టేశారు. తాజా ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని.. తిరిగి అదే పవన్ కళ్యాణ్, మోడీతో పొత్తు పెట్టుకుని జగన్ను గద్దె దించారు. జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే అక్కడ మోడీ పరిస్థితి అంత అనుకూలంగా లేదు. నితీష్ కుమార్‌, తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఎంతైనా కేంద్ర ప్రభుత్వం కొంత అస్థిరతతో ఉంది.

జాతీయ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అన్న ప్రచారం నడుస్తోంది. ఈ విధంగా చూస్తే లోక్‌స‌భలో నలుగురు ఎంపీలతో.. రాజ్యసభలో 11 మంది ఎంపీలతో జగన్ అత్యంత కీలకమైన పాత్ర పోషించవచ్చు. పైగా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ జీరో అయిపోయింది. ఈ క్రమంలోనే జగన్ క‌డప పార్లమెంటుకు జరిగే ఉప ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టేలా ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ 2011లో జరిగిన కడప పార్లమెంటు ఉప ఎన్నికలలో ఎంపీగా రెండోసారి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా గెలిచిన జగన్ ఉప ఎన్నికల్లో మాత్రం వైసిపి నుంచి ఏకంగా ఐదున్నర లక్షల మెజార్టీతో రికార్డు క్రియేట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈసారి ఎంపీగా గెలిస్తే కేంద్రంలో తనకున్న 15 మంది ఎంపీల బలంతో ఎన్డీయే కీలక నేతలతో పాటు.. మోడీ, అమిత్‌షా కు దగ్గరవ్వ‌వ‌చ్చని.. కీలక విషయాల్లో ఎన్డీఏ సర్కార్‌కు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వడం ద్వారా కేసులు పరంగాను.. ఇతర విషయాల్లోనూ తనకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. మోడీకి సన్నిహితంగా ఉంటే.. ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ఎటాక్ నుంచి కొంతవరకైనా తప్పించుకునే ఛాన్స్ ఉంటుందన్నదే జగన్ ఆలోచనగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: