వచ్చే సంక్రాంతి సీనియర్లదేనా.. ఇప్పటికే లిస్టులో ముగ్గురు.. ఎంట్రీకి రెడీగా ఉన్న మరో హీరో..?

MADDIBOINA AJAY KUMAR
వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బాక్స్ ఆఫీస్ వార్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే అనేక సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడడానికి రెడీగా ఉన్నాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన సీనియర్ హీరో అయినటువంటి ఆజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలవడానికి రెడీగా ఉన్నాయి.

అలాగే తమిళ సీనియర్ హీరో అయినటువంటి అజిత్ నటించిన సినిమా కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలబడడానికి రెడీగా ఉంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సీనియర్ హీరో అయినటువంటి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది.  అదే కానీ జరిగితే వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో ఫుల్ హవా సీనియర్ హీరోలదే అయ్యే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: