రష్మికతో రిలేషన్ పై బాంబు పేల్చిన విజయ్ ?

Veldandi Saikiran

టాలీవుడ్ ఇండస్ట్రీలో... చాలామంది ప్రముఖ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది... సొంత కాళ్లపై నిలబడి సక్సెస్ అవుతుంటే...  మరికొంతమంది వేరే హీరోల సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మెగాస్టార్ కుటుంబంలో ఏకంగా 9 మంది వరకు హీరోలు ఉన్నారు. అదే సమయంలో కొంతమంది కష్టపడి కూడా పైకి వస్తున్నారు. అలాంటి హీరోలలో విజయ్ దేవరకొండ ఒకడు. అర్జున్ రెడ్డి కంటే ముందు చాలా సినిమాలు చేసిన... అర్జున్ రెడ్డి తోనే అందరికీ హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ.
ఆ సినిమాతోనే అతనికి పాపులారిటీ వచ్చింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.  అయితే.. విజయ్ దేవరకొండ, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందాన మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కొంతమంది ప్రచారం చేశారు.

దీనికి తగ్గట్టుగానే...  విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందాన... ఇద్దరు ఫారెన్ ట్రిప్పులకు కూడా వెళ్లిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన చేశాడు. తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. కోస్టార్ తోనే డేటింగ్ చేస్తున్నట్లు వివరించాడు. అయితే ఆ కోస్టార్ పేరు చెప్పకుండానే... ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
 తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు విజయ్ దేవరకొండ. తన వయసు 35 సంవత్సరాలు ఉందని వెల్లడించారు. అయినప్పటికీ నేను సింగల్ గానే ఉన్నానని... ఎవరు అనుకోవద్దని పేర్కొన్నాడు. తాను తనతో నటించిన ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్లు స్పష్టం చేశాడు విజయ్. ప్రేమించడం ఎలా ఉంటుందో తనకు తెలుసని... గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు  తెలిపాడు. కాగా రష్మ కు గురించి విజయ్ దేవరకొండ అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: