బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఏమన్నా లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ వెబ్ సిరీస్ నటి..?

Pulgam Srinivas
ఇండియాలో మొదట హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం అయింది. ఇక హిందీ లోని ఈ షో కు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి రావడం మొదలు అయింది. దానితో కొన్ని సంవత్సరాల తర్వాత పలు భాషలలో కూడా ఈ షో ను రూపొందించడం మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగు లో కూడా ఈ షో ను స్టార్ట్ చేశారు. ఇక తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ 7 బుల్లి తెర , ఒక ఓ టి టి సీజన్ కంప్లీట్ అయింది.

తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడవ సీజన్ నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్ లకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ విజేత గా నిలిచాడు. ఇక మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ 8 ప్రారంభం కాబోతోంది. దీనికి కూడా నాగర్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సీజన్ కి కంటెస్టెంట్ లను వెతికే పనిలో బిగ్ బాస్ బృందం బిజీగా ఉంది.

అందులో భాగంగా కొంత మంది ని ఇప్పటికే ఓకే కూడా చేసినట్లు తెలుస్తోంది ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అమృతా ప్రణయ్ అనే నటిని ఈ సీజన్ లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ బృందం ఇప్పటికే సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన పరువు వెబ్ సిరీస్ లో కీలకమైన పాత్రలో నటించింది. జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈమె బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: