కెసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ.. హస్తం గూటికి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. ?

RAMAKRISHNA S.S.
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ ముమ్మరం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వరుస పెట్టి బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను సైతం పార్టీలో చేర్చుకుంటున్నారు. మరియు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో రేవంత్ రెడ్డి తో పాటు.. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, మంత్రులు మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఆదివారం లేదా సోమవారం మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు పార్టీని ? వీడుతున్నారు తెలియక బీఆర్ఎస్ నేతలు త‌ల‌ట్టుకుంటున్నారు.

ఇక ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాంగ్రెస్ చివరి వరకు సీక్రెట్ గా ఉంచుతుంది. ఎవరు ఊహించిన విధంగా ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకొని.. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఈరోజు మరో ఎమ్మెల్యేను సైతం తమ పార్టీలో చేర్చుకుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయన గతంలోనే కాంగ్రెస్‌లో చేరాల్సి ఉంది. అయితే అక్కడ స్థానిక నేత సరిత తిరుపతయ్య అలకపూనడంతో కృష్ణమోహన్ రెడ్డి చేరిక ఆలస్యమైంది. సరిత రాజకీయ భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇవ్వడంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇక మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతుంది.

వారిలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, కూకట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్లు కూడా జంపింగ్ జాబితాలో ఉన్నాయి. తాజాగా వీరు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ కావడంతో.. వీరు పార్టీ మారతారు అన్న వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.. మరి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారతారా..? లేదా ఒకరిద్దరు మినహాయించినా మిగిలినవారు కండువా మార్చేస్తారా..? అన్నదానిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: