రాజ్యసభకు రేవంత్ రెడ్డి శిష్యుడు.. లక్కీ ఛాన్స్ కొట్టేసాడే.. !

RAMAKRISHNA S.S.
తెలంగాణలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. బిఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత కే. కేశవరావు బిఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలోనే తన రాజ్యసభ పదవి సైతం ఆయన వదులుకున్నారు. రాజ్యసభ చైర్మన్ రాజీనామా ఆమోదించడంతో ఉపఎన్నిక రాబోతుంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలా, బలాలు చూస్తే కేకే రాజీనామాతో ఖాళీ అయిన సీటు.. కాంగ్రెస్‌కు దక్కనుంది. నిజానికి రాజీనామా తర్వాత ఉప ఎన్నికలలోను కేశవరావుకే అవకాశం ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ కేకే.. క్యాబినెట్ పదవులతో కూడిన సలహాదారు పదవి కట్టబెట్టడంతో.. మరో నేతకు ఈ రాజ్యసభ అవకాశం ఇస్తారన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది.

అది కూడా కాంగ్రెస్ వర్గాల నుంచే ఆ మాట వినిపిస్తోంది. ఇక ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయం కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఖచ్చితంగా కొత్త త‌రానికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. విధేయతకు తోడు యువ నాయకత్వం కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అద్దంకి దయాకర్‌కు అవకాశం ఇస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికలలో తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ కు అసెంబ్లీ టిక్కెట్ దక్కాల్సి ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడిన నేతగా.. పార్టీ వాయిస్ బలంగా వినిపించిన నేతగా.. ఇటు రేవంత్ రెడ్డికి, అనుగు అనుచరుడుగా దయాకర్‌కు మంచి పేరు ఉంది.

అసెంబ్లీ ఎన్నికలలో అవకాశం రాలేదు. పార్లమెంటు ఎన్నికలలో వరంగల్ నుంచి అయినా అవకాశం వస్తుందని అనుకున్నారు. అయితే చివరికి పార్టీ మారి వచ్చిన.. కడియం కావ్యకు అవకాశం ఇచ్చారు. పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో అద్దంకి దయాకర్‌కు ఉన్న వైరం పోయింది. దీంతో అద్దంకి దయాకర్ ను మంచి స్థానంలో చూడాలని ఉంది అంటూ కోమటిరెడ్డి సైతం సభలో కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈసారి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికలలో ఆయనకు అవకాశం వస్తుందన్న చర్చలు నడుస్తున్నాయి. ఇక బీసీ నేతకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్న నేపథ్యంలో సామాజికపరంగా కూడా అద్దంకి దయాకర్‌కు ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పదవీకాలం ఉన్న ఈ రాజ్యసభ పదవి తీసుకోవటానికి అద్దంకి దయాకర్ ముందుకు వస్తారా..? లేదా..? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: