క్రాక్ తర్వాత నో హిట్.. రవితేజతో పాటు ఆయన అభిమానులంతా వెయిట్ చేస్తున్న సమయం అదే..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో , విలన్ పాత్రలలో , అతిథి పాత్రలలో , ముఖ్యమైన పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత సినిమాలలో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు.

ఈయన హీరో గా నటించిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో వరుసగా ఈయనకు అవకాశాలు పెరగడం దానితో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ కు మంచి విజయాలు దక్కడం లేదు. కొంత కాలం క్రితం ఈ నటుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో ఏ సినిమా కూడా సరైన విజయం అందుకోలేదు.

రవితేజ "క్రాక్" మూవీ తర్వాత కిలాడి , రామారావు ఆన్ డ్యూటీ , టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ అనే మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో కొన్ని సినిమాలు పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఏ మూవీ కూడా గొప్ప స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇక ప్రస్తుతం రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తో కనుక రవితేజ మంచి విజయాన్ని అందుకోకపోతే ఈయన క్రిస్ కాస్త తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. మరి రవితేజ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: