కల్కి 2898AD: అతను లేకపోతే సినిమా బయటకు రాదు.. అశ్విని దత్ కామెంట్స్..!

lakhmi saranya
ప్రభాస్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రలర్ కల్కి 2898 ఏడి నిర్మాత అశ్విని దత్ ఇటీవల ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రభాస్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కామెంట్స్ చేశారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీ కల్కి 2898 ఏడి మూవీ. ఇప్పటికే రూ.550 కోట్లు సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కల్కి 2898 ఏడి నిర్మాత సి అశ్విని దత్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇదంతా నాగ అశ్విన్ విజున్.

ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాలో చాలా గొప్పగా ప్రాజెంట్ చేశారు. అవునండీ. స్టోరి అనుకున్నప్పుడే పార్ట్ 2 థాట్ వచ్చింది. కమల్ హాసన్ గారు ఎంటరైన తరువాత పార్ట్ 2 డీ సైడ్ అయిపోయాం. కమల్ గారిది అద్భుతమైన పాత్ర. డెన్షన్ ఏమీ లేదండి. మిడ్ సమ్మర్ లో రిలీజ్ అయితే బావుంటుందని అనుకున్నాం. అయితే మే 9 పోస్ట్ పోన్ అయ్యింది. తరువాత జూన్ 27 కరెక్ట్ అనుకుని ఆ డేట్ కి తీసుకొచ్చాం. నాగీ, స్వప్న, ప్రియాంక ఈ ముగ్గురే కాపీ చూశారు. దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందని ఉద్దేశంతోనే తీశాం.

ఆ ఉద్దేశం నెరవేరింది. ఇప్పుడే ఏం తెలీదండి, నెక్ట్స్ ఇయర్ సమ్ వేర్ ఈ డైంలోనే రావచ్చు. గతంలో శక్తి పీఠాలు నేపథ్యంలో శక్తి లాంటి సినిమా చేసినప్పుడు అలాంటి సబ్జెక్ట్ ఎందుకని కొందరు చెప్పారని అన్నారు. ఇప్పుడు దాని కంటే పవార్ ఫుల్ మహాభారతం సబ్జెక్ట చెయ్యటం భయం అనిపించలేదా? లేదండి. నాగీ ఈ కథ చెప్పినప్పుడే చాలా పకడ్భందీగా ఫెంటాస్టిక్ గా చెప్పారు. దీనితో నేను ఎలాంటి ప్రశ్రే వెయ్యలేదు. స్వప్న గారు రికార్డ్స్ గురించి అడిగితే సినిమాపై ప్రేమతో చేశామని అన్నారు? మీరు ఏం చెప్పారు? రికార్డ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. కానీ, ఈసారి వస్తున్న రికార్డ్స్ చాలా అద్భుతం. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నాగ అశ్విన్ ఈ అద్భుతాన్ని చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: