బరువు తగ్గడానికి సహాయపడే బ్లాక్ ఫుడ్స్ ఇవే..!

lakhmi saranya
చాలామందికి బ్లాక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం దానిని చాలా ఇష్టంగా తింటారు. మరికొందరికి బ్లాక్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. మీరు బరువు తగ్గాలని భావిస్తుండే..సరైన ఆహారాన్ని తినటం చాలా ముఖ్యం. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే బ్లాక్ ఫుడ్స్ మీ బరువును ఎఫెక్టివ్ గా తగ్గించటంలో సహాయపడతాయి. డార్క్ కలర్ ఫుడ్స్ కడుపు ఎక్కువ సేపు నిండుగా అనిపించడంలో సహాయపడతాయి. తినాలని ఆలోచన తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి 6శక్తివంతమైన బ్లాక్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. నల్ల బియ్యం- బ్లాక్ రైస్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇందులోని ఆంథోసైనిన్ లు బరువును నిర్వహించడంలో సహాయపడతాయి. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్లాక్ రైస్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, బరువు నియంత్రణకు దారితీస్తుంది. బ్లాక్ బీన్స్- బ్లాక్ బీన్స్ లో ప్రోటీన్లు, పోషకాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఎక్కువ బీన్స్ తినేవారు లేదా బీన్స్ ఆధారిత ఆహారాన్ని తీసుకునే వ్యక్తుల్లో శరీర కొవ్వు తక్కువగా ఉంటుంది. పొట్ట నిండుగా ఉండి తినాలనే కోరికను తగ్గిస్తుంది. బ్లాక్ బెర్రీస్- బ్లాక్ బెర్రీస్ లో తక్కువ కెలరీలు ఉంటాయి. ఇందులో అధిక వాటర్ కంటెంట్ ను ఉంటుంది.

శరీరం హైడ్రేడెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. ఇది బరువు నిర్వహణకు ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లాక్ చీయా విత్తనాలు- బ్లాక్ చియా విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు  ఉంటాయి. ఇవన్నీ బరువు నిర్వాహనకు సహాయపడతాయి. నల్ల నువ్వులు- బ్లాక్ నువ్వులు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. వీటిలో అసంతృప్త, మోనో అనేశాచురేడెడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ కొవ్వులు ఆహారం తినాలనే కోరికను తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. నల్ల పప్పులు- నల్ల కాయధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. శరీరంలో ఎక్కువ కాలరీలను బర్న్ చెయ్యటంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: