రజనీకాంత్ తో సినిమా చేసేదేలే.. బిగ్ డెసిషన్ తీసుకున్న కమల్ హాసన్..!

lakhmi saranya
కమల్ హాసన్ రీసెంట్ గా కలిపి మూవీ లో చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అలాగే రజనీకాంత్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమలహాసన్, రజనీకాంత్.. సౌత్ లోనే కాదు ఇండియన్ సినిమా మొత్తం గర్వపడే నటులు వీళ్లు. కొన్ని దశాబ్దాలుగా వీళ్లు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్నారు. తెలుగు తో పాటు ఎన్నో ఇతర భాషల్లోనూ పాపులారిటీని సంపాదించారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి మళ్లీ సినిమా చెయకూడదని నిర్ణయించుకున్నారట. తాజాగా ఇంటర్వ్యూలో కమల్ ఈ విషయం చెప్పాడు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరూ పెద్ద స్టార్ హీరోలు కమలహాసన్, రజనీకాంత్. దివంగత తమిళ దర్శకుడు బాలచందరే ఈ ఇద్దరికీ సినిమా గురువు.
ఒకప్పుడు అతని సినిమాల్లో కలిసి పని చేశారు. అయితే ఇద్దరూ స్టార్ హీరోలుగా ఎదిగిన తర్వాత మాత్రం మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కలిసి కనిపించలేదు. తెర వెనుక ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్న..ఇద్దరూ కలిసి సినిమా ఎందుకు చేయలేదు తాజాగా ఇండియన్?? ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ వివరించాడు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి సినిమా చేశారా లేక ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రల్లో అయినా కనిపిస్తారా అన్న ప్రశ్నకు అతడు స్పందించాడు. "ఇదేమీ కొత్త కాంబినేషన్ కాదు. ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఆ తర్వాత కలిసి సినిమాలు చేయకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నాం. మేము ఇద్దరు పోటీదారులలాగా కాదు. మా ఇద్దరి గురువు ఒకరే.
ప్రతి దగ్గర ఉన్న డ్లే మా మధ్య కూడా పోటీ ఉంది. కానీ శత్యత్వం లేదు. మా ఇద్దరివి వేర్వేరు దారులు" అని కమల్ అనడం గమనరహం.  "మేమిద్దరం ఎప్పుడూ ఒకరి గురించి మరొకరం నెగిటివ్ కామెంట్స్ చేసుకోము. మా 20 ల వయసులోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే దొ ముసలి వాళ్ళం, మరింత తెలివైన వాళ్ళం అయ్యామని అనుకోవటం లేదు "అని కూడా కమల్ అన్నాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో స్టార్ హీరోలా భారీ రెమ్యునరేషన్లపైనా అతడు స్పందించాడు. వాళ్లను భరించలేని స్థీతిలో ఉండే కొత్త నటుల కోసం వెతకండి అని కమల్ హాసన్ అనడం విశేషం. "ఈ నటులకు మరి అంతా మొత్తం ఇవ్వోద్దు. వాళ్లు అవసరం లేదనుకుండే కొత్త నటులను వెతక్కోండి. మీకు సూపర్ స్టార్ కావాలనుకుండే ఇవ్వాల్సిందే. వద్దు లేదా వాళ్లను భరించలేం అనుకుంటే ఇక వద్దు అంటే సింపుల్" అని కమల్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: