రీ రిలీజ్ కి రెడీ అయిన నాని లవ్ రొమాంటిక్ మూవీ.. ఈసారి కూడా మ్యాజిక్ చేస్తుందా..?

MADDIBOINA AJAY KUMAR
నాచురల్ స్టార్ నాని హీరో గా సమంత హీరోయిన్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లిపోయింది మనసు అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ కొంత కాలం క్రితం రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2012 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయింది. ఇక లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని నాని , సమంత నటనలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే వీరిద్దరి మధ్య ఈ సినిమాలో కెమిస్ట్రీ కి కూడా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను ఆగస్టు 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. మరి ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఆగస్టు 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే  ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ ని ఫోటాన్ కథాస్ , తేజా సినిమా బ్యానర్ లపై గౌతమ్ మీనన్ ,  రేష్మా , వెంకట్ సోమసుందరం , సీ.కళ్యాణ్ , సీ వీ రావు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: