అదేదో సినిమాలో చెప్పినట్లు హీరో బయటికి రానంత వరకే విలన్ ఆగడాలు సాగుతాయి.ఒక్కసారి హీరో బయటికి వచ్చి తన హీరోయిజాన్ని చూపిస్తే విలన్ తన గూండాలతో సహా అన్ని మూసుకొని వెళ్ళిపోవడమే.. అదేదో సామెత ఉన్నట్లు సింహం బోనులో ఉన్నంతవరకే ఎలక కుప్పిగంతులు వేస్తుంది. ఒక్కసారి బోను దాటి సింహం బయటకు వచ్చిందంటే ఇక సింహం ముందు ఎవరు నిలవలేరు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశం ఎక్కువగా వినిపిస్తోంది. అదేంటంటే.. కేసీఆర్ ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారో అప్పటినుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు. కేసీఆర్ మైనస్ ని ప్లస్ గా చేసుకుందామనుకుంటున్న రేవంత్ రెడ్డి పదేపదే కేసీఆర్ ని విమర్శిస్తూ రా బిడ్డ బయటికి చూసుకుందాం..నీ ప్రతాపమో నా ప్రతాపమో.. ముందు ఫామ్హౌస్ దాటి అసెంబ్లీకి రా దమ్ముంటే అంటూ బహిరంగ సభల్లో సవాల్ విసిరుతున్నారు.
ఇక రేవంత్ రెడ్డి మాటలు విని విని విసిగిపోయిన కేసీఆర్ మొన్న ఒకరోజు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే రేవంత్ తట్టుకోలేకపోయాడు.చివరికి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఎలా దెబ్బ కొట్టాలో తెలియక ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా దుర్భాషలాడుతూ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడారు. ఇక రేవంత్ రెడ్డి మాటలపై ఇప్పటికే చాలామంది మండి పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పదేపదే కేసీఆర్ ని పట్టుకొని దా.. దమ్ముంటే రా అసెంబ్లీకి అంటూ సవాల్ విసురుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి పదేపదే కేసీఆర్ ను పట్టుకొని అలా మాట్లాడడం బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఎవరికీ నచ్చలేదు. చివరికి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం ఇక రేవంత్ రెడ్డి ఆటలు సాగవు. ఆయన బయటికి రానంతవరకే రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది. ఒక్కసారి ఆయన బయట అడుగు పెట్టారంటే ఇక రేవంత్ రెడ్డి తట్టా బుట్టా సర్దాల్సిందే అంటున్నారు ఈ విషయ తెలిసిన కేసీఆర్ అభిమానులు.అయితే ప్రస్తుతం కేటీఆర్ ని రేవంత్ రెడ్డి పోటీగానే చూస్తున్నారు కానీ కేసీఆర్ స్థాయిలో కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఊహించుకోవడం లేదు. ఇదే రేవంత్ రెడ్డి కి ఇన్నిరోజులు అదే ప్లస్ అయింది. కానీ ఒక్కసారి కేసీఆర్ బయటికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి స్థానం మారిపోతుంది. మరి చూడాలి రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేసి మళ్లీ ప్రజల నాయకుడిగా మారిపోతారా..లేక ఎప్పటిలాగే ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా అనేది.