గోల్డ్: భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు..ఈరోజు ఏంతంటే.. ?
బంగారం ధర కేవలం దేశీయ మార్కెట్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని తాకాయి. ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 4,559 డాలర్లకు చేరుకుంది. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధర వేగంగా పెరుగుతూనే ఉంది. ఈ డిసెంబర్ నెలలో ఏకంగా బంగారం ధర 320 డాలర్ల వరకు పెరిగింది. ఈ పెరుగుదల ప్రభావమే భారత మార్కెట్ పైన కూడా చాలా బలంగా పడినట్లు కనిపిస్తోంది. నిపుణులు సైతం ఈ విషయం పైన మాట్లాడుతూ.. 1979 తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీ మొత్తంలో బంగారు లాభాలు ఇవ్వడం ఇదే మొదటిసారి అని తెలుపుతున్నారు.
బంగారం ధరలు పెరగడానికి బలమైన కారణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అందులో ఇండస్ట్రియల్ డిమాండ్.. ఇప్పుడు ఎక్కువగా సోలార్ ప్యానల్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదే అభివృద్ధిస్తోంది. వీటన్నిటిని తయారు చేయడానికి వెండి చాలా ముఖ్యము.. AI చిప్స్ , సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి వెండిని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. గనులలో కూడా వెండి అంతంత మాత్రమే దొరుకుతోంది. దీంతో వెండి సరఫరా కూడా తగ్గిపోవడంతో డిమాండ్ ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతోంది. బంగారం విషయానికి వస్తే ఇన్వెస్టర్లు డాలర్లను వదిలి మరి బంగారం, వెండిలో పెట్టుబడులు పెడుతున్నారు.. అందుకే ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని చెబుతున్నారు.త్వరలోనే వెండి ధర ఔన్స్ కి 200 డాలర్లకు చేరుతుందని ఆర్థిక నిపుణులు రాబర్ట్ కిమోసాకి తెలిపారు. దీంతో మన ఇండియాలో కిలో వెండి రూ .5 లక్షల వరకు దాటవచ్చు.