అతని చేతిలో నమ్మి మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ..శారీరకంగా కూడా..?
నిరంతరం స్కిన్ షో తో గ్లామర్ ఫోటోలతో ట్రెండీగా మారిన ఇనయా సుల్తానాకు ఈ మధ్యకాలంలో ఆఫర్లు తగ్గిపోయి ఒంటరితనం వేధిస్తోంది అంటూ తెలియజేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇనయా మాట్లాడుతూ.. నేను చనిపోయిన కూడా ఎవరు రారనే భయం తనలో ఉండేదని ఆ సమయంలోనే గౌతమ్ అనే వ్యక్తి తన జీవితంలోకి వచ్చారని, తన మీద ఎవరు చూపించని ప్రేమను కురిపించేవారు. ఆ ప్రేమ నిజమే అనుకొని అతనికి శారీరకంగా కూడా దగ్గరయ్యాను, అతడు అవసరాలు తీరాక తన ఫేమ్, మరియు డబ్బులను వాడుకొని తనని వదిలేసాడంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.
ఆ సమయంలో తాను తీవ్రమైన మానసిక క్షోభను కూడా అనుభవించానని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపానని, తనని మోసం చేయడమే కాకుండా సమాజంలో కూడా తనని తప్పుగా చూపించేలా మానిప్యులేట్ చేశారంటూ తెలియజేసింది. ఒకానొక దశలో సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ తనను మోసం చేసిన వాడి కోసం నా ప్రాణాలు తీసుకోవడం వేస్ట్ అని ఆగిపోయాను, ఒంటరితనంలో తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం నా జీవితాన్ని నరకంలోకి నెట్టేసింది. నాలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదంటూ తెలియజేసింది. తనకి వచ్చిన ఫ్రేమ్ చూసి అసూయతో వేధించేవాడు అంటూ తెలియజేసింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్న మళ్లీ కెరియర్ పైన ఫోకస్ పెట్టాను ప్రస్తుతం ఆరేడు సినిమాలలో నటిస్తున్నానని తెలిపింది.