ఒక్క పోస్ట్ తో "టాక్ ఆఫ్ ది టౌన్" గా మారిన అక్కినేని కోడలు పిల్ల..ఫ్యాన్స్ ఇంప్రెస్..!
ముఖ్యంగా ఏ-రేటింగ్ సినిమాగా ఈ స్థాయి విజయం సాధించడం విశేషమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ చిత్రం కథ, కథనం, రణ్‌వీర్ సింగ్ నటనకు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల నుంచి కూడా విస్తృతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా అక్కినేని కుటుంబ కోడలు, ప్రముఖ నటి శోభిత ధూళిపాళ కూడా ‘ధురంధర్’ సినిమాను వీక్షించి తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె ఈ చిత్రాన్ని ఘనంగా ప్రశంసించారు.శోభిత తన స్టోరీలో..“వావ్.. వావ్.. వావ్.. ఉత్కంఠభరితం. మనసును కదిలించే చిత్రం. స్ఫూర్తిదాయకం. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నిటికీ భిన్నంగా ఉంది. అత్యున్నత స్థాయిలో రూపొందింది. సారా అర్జున్ ఎంత ప్రతిభ, ఎంత అందం!” అని రాసుకొచ్చారు. అంతేకాదు, సెల్యూట్ చేస్తున్న ఎమోజీలు, నమస్కారం చేస్తున్న ఎమోజీలు, హార్ట్ సింబల్స్‌ను జోడించి తన అభిమానం వ్యక్తం చేశారు.
శోభిత ధూళిపాళ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రశంసలతో ‘ధురంధర్’ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ స్టోరీని చూసిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తూ, సినిమా గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. మొత్తంగా చూస్తే, ‘ధురంధర్’ కేవలం బాక్సాఫీస్ విజయం మాత్రమే కాకుండా విమర్శకులు, ప్రేక్షకులు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంటూ 2025లో అత్యంత గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తోంది..!