ఒకప్పుడు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..హీరోగా..డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. పలు సినిమాలు చేసిన శివాజీ బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత శివాజీకి వెబ్ సిరీస్ లు, సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా బిగ్ బాస్ 7 తర్వాత #90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.అంతేకాకుండా ఈ ఏడాది వచ్చిన కోర్టు మూవీ లోని మంగపతి క్యారెక్టర్ కి శివాజీకి మంచి మార్కులే పడ్డాయి. అలా ఈ ఏడాది చివర్లో మరోసారి దండోరా మూవీతో మన ముందుకు వచ్చారు శివాజీ. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆడవారి బట్టల గురించి ఆడవారి శరీర భాగాలను సామాన్లతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు శివాజీ. అయితే ఆడవారి బట్టల గురించి శివాజీ మాట్లాడిన మాటల పట్ల చాలామంది ఆయనకు మద్దతు తెలిపినప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నట్లుగా వేలెత్తి చూపారు.
అంతేకాదు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ కూడా మండిపడి ఆయన్ని విచారణకు పిలిచింది.అలా విచారణకు కూడా హాజరైన శివాజీ మాట్లాడిన మాటలకు తప్పయింది అని క్షమాపణ కోరినట్టు తెలిపారు. ఇక ఇంత ఇష్యూ జరిగినా కూడా శివాజీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదు అని సోషల్ మీడియా నెటిజెన్లు మొత్తం ఆయన వైపే ఉన్నారు.ఎంతోమంది ఆడవాళ్లు కూడా శివాజీ మాట్లాడింది 100% కరెక్ట్ అని సపోర్ట్ చేశారు.కానీ కొంతమంది మాత్రమే ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడారు.ఇదిలా ఉంటే తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మహిళా కమిషన్ పై సీరియస్ అయ్యారు.ఆయన శివాజీ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. మహిళల డ్రెస్సింగ్ పై శివాజీ కావాలని మాట్లాడినట్టు నాకు ఎక్కడా కూడా అనిపించడం లేదు.
అయితే ఈ విషయంలో మహిళా కమిషన్ శివాజీని విచారణకు పిలవడాన్ని నేను ఒప్పుకుంటున్నాను.కానీ అప్పట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ నేషనల్ ప్లాట్ఫారం మీద ఫ్యాన్స్ అడిగితే అమ్మాయిలకు కడుపు అయినా చేయాలి ముద్దైనా పెట్టాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆ సమయంలో మహిళా కమిషన్ ఎందుకు నోరు మెదపలేదు.అప్పుడు మహిళా కమిషన్ ఏమైపోయింది.. శివాజీ మాట్లాడింది తప్పయితే బాలకృష్ణ మాట్లాడింది అంతకంటే పెద్ద తప్పు..మరి మహిళా కమిషన్ అప్పుడు ఏమీ చేయలేదు. ఆయన పెద్ద నటుడనో లేక పేరున్న నటుడు, రాజకీయ నాయకుడి కొడుకని భయపడి వదిలేసారా..ఈ విషయంలో మహిళ కమిషన్ ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి అంటూ కేఏ పాల్ సీరియస్ అయ్యారు.