బొత్స స్వరం మారింది..చంద్రన్నపై ఇష్టం పెరుగుతుందా.?

Pandrala Sravanthi
బొత్స సత్యనారాయణ  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన తెలియని వారు ఉండరు. రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించిన బొత్స సత్యనారాయణ, చీపురుపల్లి నియోజకవర్గం తన కంచుకోటగా మార్చుకున్నారు.  అలాంటి కంచుకోటను కళా వెంకట్రావు  కొల్లగొట్టారు. బొత్స సత్యనారాయణ ఓడించి చీపురుపల్లి గడ్డపై టిడిపి జెండా ఎగరవేశారు. అలాంటి బొత్స సత్యనారాయణ  వైసీపీ పార్టీలో నమ్మిన బంటుగా ఉన్నారు. బొత్సను తన తండ్రిలా భావించేవాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమి తర్వాత స్వరం మార్చినట్టే కనిపిస్తోంది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ  టిడిపిపై ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..  ఆదివారం మీడియాతో ముచ్చటించిన బొత్స సత్యనారాయణ టిడిపి ప్రభుత్వ నిర్ణయాలు చాలా బాగున్నాయని అన్నారు.  

ఈ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు అయిందని ఇప్పటికే వీరు తీసుకునే నిర్ణయాలు విధివిధానాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. పేదలకు 4,000 పెన్షన్ ఇవ్వడం అద్భుతమైన నిర్ణయం అని తెలిపారు.  మిగిలిన పథకాలు కూడా  వీటిలాగే అమలు చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని,  మిగిలిన పథకాలు కూడా అమలు చేయడానికి టిడిపి శక్తినివ్వాలని  ఆయన కోరుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారినటువంటి వీసీల రాజీనామా విషయంపై కూడా  ఆయన స్పందించారు. వీసీల రాజీనామాలను సర్కారు కోరడం తప్పుకాదన్నారు. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో వైసిపి కార్యాలయంలోకి కూటమి నాయకులు చొరబడితే  అది తప్పే అని , గతంలో మా పార్టీ నాయకులు కూడా టిడిపి ఆఫీసులపై దాడి చేయడాన్ని నేను ఖండించాలని తెలియజేశారు.

 రాష్ట్రంలో ఇటు టిడిపి నాయకులు మరియు వైసీపీ నాయకులు కూడా ప్రజా క్షేమం కోసం పనిచేయాలన్నారు. వైసిపి హయాంలో నష్టం జరిగిందని కొందరు అంటున్నారని, ఎప్పుడు నష్టం జరిగింది, ఎలా నష్టం జరిగిందనేది లెక్కలు బయటపడితే తేలుతుందని తెలియజేశారు. తప్పు పనులు చేస్తే ఎప్పుడు దాగదని  తెలిపారు. ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టే మేము ఓడిపోయామని, మా ఓటమిని మేము అంగీకరిస్తున్నామని తెలియజేశారు..  ఈ విధంగా టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఫెవర్ గా మాట్లాడడం చూస్తుంటే మాత్రం చంద్రబాబుపై బొత్సకు ప్రేమ పెరిగిందని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: